జుట్టు రోజుకి ఒక్క అంగుళం పొడవు పెరగాలంటే... మంచి చిట్కా  

Super Fast Hair Growth -

జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరిగే హోమ్ రెమెడీ గురించి ఈ రోజు తెలుసుకుందాం.ప్రతి ఒక్కరు జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరగాలని కోరుకుంటారు.

జుట్టు మృదువుగా సిల్కీ గ ఉండాలని కోరుకోవటం సహజమే.అలాంటి జుట్టును పొందటానికి రకరకాల ప్రయత్నాలను చేస్తూ ఉంటాం.

TeluguStop.com - Super Fast Hair Growth-Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు-Telugu Tollywood Photo Image

అలాంటి వారు ఈ సింపుల్ చిట్కాను ఉపయోగిస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.ఈ చిట్కాను ఒక నెల పాటు use చేస్తే ఆ తేడా గమనించి మీరు చాల ఆశ్చర్యపోతారు.

ఈ చిట్కా అంత బాగా పనిచేస్తుంది.అలాగే జుట్టు రాలే సమస్యను కూడా తగ్గిస్తుంది.

ఈ చిట్కాను ఫాలో అయితే ఒత్తైన అందమైన జుట్టు మీ సాంతం అవుతుంది.

చిట్కాకి ఏమి అవసరం అవుతాయో చూద్దాం
bru కాఫీ పొడి 2 స్పూన్స్
కొబ్బరి నూనె 1 స్పూన్
పెరుగు 3 స్పూన్స్

ఇప్పుడు ఆ రెమెడీని ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం.


ఈ హెయిర్ ప్యాక్ లో ముఖ్యమైన ఇంగ్రిడియాన్ కాఫీ పొడి.కాఫీ పొడి తలపైన మాడుకు రక్త ప్రసరణను బాగా జరిగేలా చేస్తుంది.అలాగే జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తుంది.ఇక్కడా నేను రెండు స్పూన్ల కాఫీ పొడిని ఉపయోగిస్తున్నాను.

ఇలా కాఫీ పొడిని బౌల్ లోకి తీసుకున్నాక మన సెకండ్ ఇంగ్రిడియాన్ కొబ్బరి నూనె.ఒక స్పూన్ కొబ్బరి నూనెను తీసుకోని కాఫీ పొడిలో వేసి బాగా కలపాలి.

ఇలా పేస్ట్ గా తయారైన తర్వాత మూడో ఇంగ్రిడియన్ పెరుగును తీసుకోవాలి.

పెరుగు డేమేజ్ అయిన జుట్టును రిపేర్ చేయటంలో బాగా సహాయాపడుతుంది.

అలాగే జుట్టుకు అవసరమైన పోషణ,తేమను అందించి జుట్టు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.మూడు స్పూన్ల పెరుగును వేసి బాగా కలపాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించి అరగంట తర్వాత మీరు సాధారణంగా వాడే షాంపూ తో తలస్నానము చేయాలి.ఇలా వారానికి రెండు సార్లు అప్లై చేస్తూ ఉంటే మీ జుట్టు సిల్కి గా,మృదువుగా మారుతుంది.

ఈ రెమిడీ ని క్రమం తప్పఁకుండా ఫాలో అయితే చాలా తక్కువ సమయంలోనే ఒత్తైన జుట్టును పొందవచ్చు.అలాగే జుట్టు రాలే సమస్య నుండి కూడా బయట పడవచ్చు.

వారానికి రెండు సార్లు చొప్పున నెల రోజుల పాటు ఈ పేస్ట్ ని జుట్టుకు అప్లై చేసి తలస్నానము చేస్తే జుట్టు ఒత్తుగా పెరగటాన్ని గమనించి మీరే ఆశ్చర్యపోతారు.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Super Fast Hair Growth Related Telugu News,Photos/Pics,Images..