ఓపెన్ పోర్స్( Open pores ).దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
చాలా మంది సర్వ సాధారణంగా ఎదుర్కొనే చర్మ సమస్యల్లో ఇది ఒకటి.ఓపెన్ పోర్స్ అంటే చర్మం మీద స్వేద గ్రంధులు తెరుచుకుని ఉండడమే.
ఆహారపు అలవాట్లు, మేకప్ ఉత్పత్తులు, సన్ స్క్రీన్ ను ఎవైడ్ చేయడం, హార్మోనల్ చేంజెస్, చెమట ఉత్పత్తి అధికంగా ఉండటం, కాలుష్యం తదితర కారణాల వల్ల ఓపెన్ పోర్స్ సమస్య ఏర్పడుతుంది.దీని కారణంగా చెమట, మురికి ఎక్కువగా చేరి మొటిమలు, మచ్చలు, బ్లాక్ హెడ్స్ వంటివి తలెత్తుతాయి.
అందుకే ఓపెన్ పోర్స్ సమస్య నుంచి బయటపడేందుకు ముప్పతిప్పలు పడుతుంటారు.మీరు కూడా ఓపెన్ పోర్స్ తో బాగా విసిగిపోయారా? ఎన్ని క్రీములు వాడిన సమస్య పరిష్కారం కావడం లేదా.? అయితే వర్రీ వద్దు.ఇప్పుడు చెప్పబోయే రెమెడీని పాటిస్తే చాలా సులభంగా ఓపెన్ పోర్స్ సమస్యకు బై బై చెప్పవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో నాలుగైదు రెబ్బలు వేపాకు( Neem leaves) వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి వేపాకు జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు వేపాకు జ్యూస్ వేసుకోవాలి.
అలాగే వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్( Aloe Vera Gel ), వన్ టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్( Orange peel powder ), వన్ టేబుల్ స్పూన్ శనగపిండి, రెండు చుక్కలు విటమిన్ ఈ ఆయిల్ వేసుకుని మరోసారి అన్నీ కలిసేలా మిక్స్ చేయాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖం మొత్తానికి అప్లై చేసుకుని ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై కూల్ వాటర్ తో చర్మాన్ని శుభ్రంగా వాష్ చేసుకోండి.రెండు రోజులకు ఒకసారి ఈ రెమెడీని కనుక పాటిస్తే ఓపెన్ పోర్స్ అన్న మాటే అనరు.ఈ రెమెడీ ఓపెన్ పోర్స్ ను క్లోజ్ చేయడానికి ఉత్తమంగా సహాయపడుతుంది.
అలాగే ఈ రెమెడీని పాటిస్తే మొండి మొటిమలు, మచ్చలు ఉంటే మాయం అవుతాయి.చర్మం క్లియర్ అండ్ గ్లోయింగ్ గా మారుతుంది.