Royal Enfield Hunter 350: ఆ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌కి సూపర్ క్రేజ్.. మూడు నెలల్లోనే రికార్డు బద్దలు!

బైక్స్ ప్రీమియం సెగ్మెంట్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు తిరుగు లేదు.ఈ చెన్నై కంపెనీ సరికొత్త డిజైన్, అడ్వాన్స్‌డ్‌ ఫీచర్స్‌తో బైక్ లవర్స్‌ను ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటూనే ఉంటుంది.

 Super Craze For That Royal Enfield Bike.. Breaking The Record Within Three Month-TeluguStop.com

కాగా గత కొన్ని నెలలుగా రాయల్ ఎన్‌ఫీల్డ్‌ కంపెనీ నుంచి వచ్చిన హంటర్ 350 మోడల్ అమ్మకాల్లో దూసుకెళ్తోంది.ఈ సరికొత్త మోడల్‌ను రాయల్ ఎన్ఫీల్డ్ ఆగస్ట్ నెలలో విడుదల చేయగా ఆ నెల నుంచి సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ప్రతి నెలా 15,000 యూనిట్లకు తగ్గకుండా ఈ హంటర్ 350 బైక్స్ అమ్ముడుపోయాయి.

జస్ట్ మూడు నెలల్లోనే మొత్తంగా 50,000 బైక్స్‌ను అమ్మినట్లు కంపెనీ చెబుతోంది.సాధారణంగా రాయల్ ఎన్‌ఫీల్డ్‌ బైక్స్‌కు డిమాండ్ ఎక్కువే! అయితే ఈ హంటర్ 350 మోడల్ బైక్ అమ్మకాల్లో రికార్డులు సృష్టిస్తోంది.

హంటర్ 350 అమ్మకాలు ఆగస్టు నెలలో 18,197 బైక్స్, సెప్టెంబర్ నెలలో 17,118 బైక్స్ అమ్ముడు అవ్వగా 2022 అక్టోబర్ నెలలో 15,445 యూనిట్లు అమ్మకాలు జరిగినట్లు కంపెనీ తెలిపింది.ఆకట్టుకునే లేటెస్ట్ డిజైన్, అడ్వాన్స్‌డ్‌ ఫీచర్స్ ఉన్న ఈ బైక్ ధర రూ.1.50 లక్షల నుంచి రూ.1.64 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకు ఉంది.ఈ కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ 350 సీసీ ఇంజన్‌తో రెండు మోడల్లో అందుబాటులో ఉంది.ఒకటి రిట్రో మోడల్ కాగా మరొకటి మెట్రో మోడల్.స్పోర్ట్స్ సర్క్యులర్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, టర్న్ సిగ్నల్స్‌తో, రౌండ్ సెమీ-డిజిటల్ స్పీడోమీటర్ కన్సోల్ వంటి లేటెస్ట్ ఫీచర్స్ ఈ బైక్ లో ఉన్నాయి.

Telugu Engine, Hunter Bike, Hunter, Royal Enfield, Royalenfield-Latest News - Te

349 సీసీ సింగిల్-సిలిండర్ ఇంజన్‌తో వస్తున్న ఈ బైక్ 6100 ఆర్‌పిఎమ్ వద్ద 20.2 బిహెచ్‌పి పవర్, 4000 ఆర్‌పిఎమ్ వద్ద 27 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.దీనిలో 5-స్పీడ్ గేర్‌బాక్స్ ఆఫర్ చేశారు.ఈ బైక్ 36.2 కిమీ/లీ వరకు మైలేజ్ అందిస్తుంది.దీని టాప్ స్పీడ్ 114కిమీ/గం.ఈ బైక్ లో చాలా నాజూగ్గా వుండి లైట్ వెయిట్ తో వస్తుంది.2,055 మిమీ పొడవు, 800 మిమీ వెడల్పు, 1,055 మిమీ ఎత్తుతో ఉండే దీనిని సిటీలో ఈజీగా రైడ్‌ చేయవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube