కేజీఎఫ్ హీరో యష్ హత్యకి సుపారీ! యష్ ఫ్యాన్స్ ఆందోళన  

కేజీఎఫ్ హీరో యష్ ని హత్యచేయడానికి ప్లాన్ చేసిన సుపారీ గ్యాంగ్. .

Supari Gang Try To Murder Hero Yash-kannada Cinea,kgf Hero,murder,raking Star Yash,supari Gang,tollywood

  • కేజీఎఫ్ సినిమాతో ఆల్ ఇండియా స్థాయిలో క్రేజీ హీరోగా మారిన నటుడు రాకింగ్ స్టార్ యష్. కన్నడ ఇండస్ట్రీలో వరుస హిట్స్ తో ఒక్కసారిగా దూసుకొచ్చిన యష్ తాజాగా రిలీజ్ అయిన కేజీఎఫ్ సినిమాతో కన్నడ ఇండస్ట్రీ చరిత్రలో అత్యధిక కలెక్షన్ రికార్డ్ ని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం కేజీఎఫ్ సినిమా సీక్వెల్ కి యష్ సిద్ధం అవుతున్నాడు. అయితే ఎలాంటి ఇండస్ట్రీ బ్యాగ్రౌండ్ లేకుండా కన్నడ ఇండస్ట్రీలో జెట్ స్పీడ్ తో దూసుకొచ్చిన యష్ అంటే ఇండస్ట్రీలో కొంత మందికి తీవ్ర వ్యతిరేకత వుందని టాక్ వుంది. ఆ మధ్య కర్ణాటకలో జర్నలిస్ట్ మర్డర్ కేసులో అరెస్ట్ అయిన సుపారీ గ్యాంగ్ యష్ ని కూడా చంపడానికి ప్లాన్ చేసారనే వార్త హల్చల్ చేసింది.

  • ఇదిలా వుంటే శనివారం సాయంత్రం బెంగుళూరు లో కొంత మంది సుపారీ రౌడీ షీటర్స్ ని అరెస్ట్ చేసారు. పోలీసుల విచారణలో వారు షాకింగ్ విషయాలని బయట పెట్టారు. యష్ ని చంపడానికి సుపారీ తీసుకున్నామని చెప్పారు. ఈ వార్త కాస్తా బయటకి రావడంతో ఒక్కసారిగా యష్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేసారు. అయితే ఈ విషయంపై యష్ మీడియా ముందుకి వచ్చి ఫ్యాన్స్ ఎవరు భయపడాల్సిన పని లేదని తనను ఎవరు టచ్ చేసే ధైర్యం చేయలేరని చెప్పారు. అయితే ఈ విషయం బయటకి వచ్చిన తర్వాత తన కుటుంబ సభ్యులు కూడా కొంత ఆందోళనకి గురయ్యారని చెప్పుకొచ్చారు.