ఐపీఎల్ లో సన్ రైజర్స్ కథ ముగిసింది.. ఎలిమినేటర్ లో ఢిల్లీ విజయం...

ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ చేతిలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓటమి పాలయింది.ఢిల్లీ , సన్ రైజర్స్ జట్లు 3,4 స్థానాలలో ఉండడం తో వారి క్వాలిఫైయర్ మ్యాచ్ ఆడాలంటే ఎలిమినేటర్ మ్యాచ్ లో తప్పక గెలవాల్సిందే, ఢిల్లీ జట్టు అన్ని విభాగాల్లో సన్ రైజర్స్ ని కట్టడి చేసింది.

 Sunrisers Story Ends In Ipl Delhi Capitals Victory In Eliminator-TeluguStop.com

ముఖ్యంగా టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన సన్ రైజర్స్ జట్టు కి పవర్ ప్లే లో మంచి ఆరంభం దొరికింది.వృద్ధిమన సహా త్వరగా ఔట్ అయినప్పటికీ మార్టిన్ గుప్తిల్ , మనీష్ పాండే కలిసి జట్టు కి చక్కటి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

అయితే మార్టిన్ గుప్తిల్ పవర్ ప్లే లో ఫోర్ లు సిక్స్ లు కొట్టి స్కోర్ బోర్డ్ ని పరిగెత్తించాడు.కానీ మనీష్ పాండేపాండే , కేన్ విలియమ్సన్ లు పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డారు , హిట్టింగ్ చేయలేక మంచి ఆరంభాన్ని భారీ స్కోర్ గా మలచలేకపోయారు.

చివర్లో విజయ్ శంకర్ , మహమ్మద్ నబి మెరుపులతో 162 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ముందు ఉంచింది.ఇకపోతే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రబడ లాంటి బౌలర్ లేనప్పటికీ ఇషాంత్ , బౌల్ట్ , కీమో పాల్ లు అద్భుతంగా బౌలింగ్ చేసి హైదరాబాద్ జట్టు ని కట్టడి చేశారు.

ఐపీఎల్ లో సన్ రైజర్స్ కథ ముగిస

163 పరుగుల లక్ష్య చేదనలో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు పవర్ ప్లే లొనే 50 కి పైగా పరుగులు సాధించింది , ముఖ్యంగా యంగ్ ఓపెనర్ ప్రిథ్వీ షా 34 బంతుల్లో నే 50 పరుగులు చేసి జట్టుకు శుభారంభాన్ని అందించాడు.ధావన్ , శ్రేయస్ అయ్యర్ , ప్రిథ్వీ షా లను వెంటవెంటనే పెవిలియన్ కి పంపిన హైదరాబాద్ బౌలర్లు తరువాత క్రీజు లోకి వచ్చిన రిషబ్ పంత్ ని కట్టడి చేయలేకపోయారు.పంత్ కి మరో ఎండ్ నుండి ఎవరు సపోర్ట్ ఇవ్వకపోవడం తో సన్ రైజర్స్ బౌలర్లు ఢిల్లీ పరుగుల ప్రవాహాన్ని అపగలిగింది.ఒకానొక దశలో ఢిల్లీ 20 బంతుల్లో 40 పరుగులు చేయాల్సిన సమయం లో రిషబ్ పంత్ తంపి బౌలింగ్ లో 22 పరుగులు రాబట్టాడు , దానితో ఢిల్లీ విజయం ఖాయమయిపోయింది.

కానీ అనవసర షాట్ కి ప్రయత్నించి ఔట్ అయిన రిషబ్ పంత్ ఇన్నింగ్స్ ని ముగించలేకపోయాడు.ఈ మ్యాచ్ చివరి ఓవర్ లో ఉత్కంఠగా సాగింది.చివరికి ఢిల్లీ జట్టు సన్ రైజర్స్ జట్టు పైన 2 వికెట్ల తేడాతో విజయం సాధించి రెండవ క్వాలిఫైయర్ కి అర్హత సాధించింది.ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు క్వాలిఫైయర్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడనుంది.

ఈ మ్యాచ్ లో గెలిచే జట్టు ముంబై ఇండియన్స్ తో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube