బెంగళూరు బ్యాటింగ్ జోరుకు సన్ రైజర్స్ బౌలింగ్ కళ్లెం వేయగలదా…?  

Sun Risers Hyderabad vs Royal Challengers Bangalore, sun risers hyderabad, royal challengers bengalore, ipl2020, kohili, warner, wilimson, ab devilries - Telugu Ab Devilries, Ipl2020, Kohili, Royal Challengers Bengalore, Sun Risers Hyderabad, Sun Risers Hyderabad Vs Royal Challengers Bangalore, Warner, Wilimson

నేడు ఐపీఎల్ 2020 సీజన్ లో మూడో మ్యాచ్ గా రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు తో సన్ రైజర్స్ జట్లు హైదరాబాద్ సమరానికి సిద్ధమవుతున్నాయి.టోర్నీలో మొదటి విజయాన్ని అందుకోవాలని ఇరు టీమ్స్ పట్టుదలతో ఉన్నాయి.

TeluguStop.com - Sunrisers Hyderabad Vs Royal Challengers Banglore

ఇక రెండు టీమ్స్ లో స్టార్ క్రికెటర్లకు కొదవేలేదు.రాయల్ చాలెంజర్స్ బెంగళూరులో ఎబి డివిలియర్స్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ లాంటి మ్యాచ్ విన్నర్ బ్యాట్స్మెన్స్ ఉండగా మరోవైపు హైదరాబాద్ సన్ రైజర్స్ టీమ్ లో కేన్ విలియమ్సన్, డేవిడ్ వార్నర్ స్టార్ ఆటగాళ్లు ఉండనే ఉన్నారు.

ఇక బౌలింగ్ విషయానికి వస్తే.ఇరు జట్లలలో కూడా సమానంగా బౌలర్లు ఉన్నారు.మొత్తానికి రెండు టీమ్స్ అటు బ్యాటింగ్ లోనూ ఇటు బౌలింగ్ లోనూ సమఉజ్జీలుగా కనబడుతున్నాయి. సన్ రైజర్స్ టీం విషయానికి వస్తే… సందీప్, మనీష్ పాండే, వృద్ధిమాన్, సాహా లతోపాటు మరికొంతమంది ఆటగాళ్లతో హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్ చాలా బలంగా కనపడుతోంది.

TeluguStop.com - బెంగళూరు బ్యాటింగ్ జోరుకు సన్ రైజర్స్ బౌలింగ్ కళ్లెం వేయగలదా…-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇక ఇందులో డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్ కొద్దిసేపు ఆడితే చాలు హైదరాబాద్ లో భారీ స్కోరు చేయడానికి అవకాశాలు ఉన్నాయి.ఇక అలాగే బౌలింగ్ విషయానికి వస్తే ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు రషీద్ ఖాన్, మహమ్మద్ నబి లతో పాటు టీమిండియా బౌలర్లు భువనేశ్వర్ కుమార్ ప్రధాన అస్త్రంగా ఉన్నారు.

ఇక మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు విషయానికి వస్తే… బ్యాటింగ్ విరాట్ కోహ్లీ, మిస్టర్ 360 ఎబి డివిలియర్స్, ఆరోన్ ఫించ్, సిరాజ్, శివమ్ దూబే బ్యాటింగ్ లో కనబడుతుంటే మరోవైపు బౌలర్స్ విషయానికి వస్తే,, స్టెయిన్, చాహల్, మోయిన్ అలీ లాంటి ఆటగాళ్ళు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో చాలా బలంగా కనబడుతున్నారు.ఇకపోతే బెంగళూరు ఈసారి కూడా టీమిండియా కెప్టెన్ కోహ్లీ, అలాగే డివిలియర్స్ పైనే ఎక్కువ ఆశలు పెట్టుకుంది.

#IPL2020 #Kohili #SunRisers #Wilimson #Warner

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sunrisers Hyderabad Vs Royal Challengers Banglore Related Telugu News,Photos/Pics,Images..