దాదాపు ఐపీఎల్ లో లీగ్ స్టేజి ముగింపుకు వచ్చింది.ఇప్పటికే బెంగళూర్ , రాజస్థాన్ , కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు ప్లే ఆఫ్స్ రేస్ నుండి తప్పుకోగా చెన్నై , ఢిల్లీ , ముంబై జట్లు ప్లే ఆఫ్స్ కి చేరుకున్నాయి.
అయితే ప్లే ఇఫ్స్ లో నాలుగవ స్థానం కోసం సన్ రైజర్స్ , కోల్ కత్తా నైట్ రైడర్స్ కి మాత్రమే అవకాశం ఉంది.ఒకవేళ బెంగళూర్ మ్యాచ్ లో సన్ రైజర్స్ గెలిస్తే ప్లే ఆఫ్స్ కి వెళ్లడం ఖాయం.
అది కాకుండా మ్యాచ్ లో ఓటమి పాలయితే కోల్ కత్తా ఆడే చివరి మ్యాచ్ పైన ఆధారపడాల్సి ఉంటుంది.బెంగళూర్ ఆడిన గత మ్యాచ్ వర్షం కారణంగా ఆగిపోవడం తో బెంగళూర్ ఆడే తన చివరి మ్యాచ్ ని విజయం తో ముగించాలని భావిస్తుంది.ఇకపోతే సన్ రైజర్స్ జట్టు మాత్రం ఈ మ్యాచ్ ని ఎలాగైనా గెలవాలన్న లక్ష్యం తో బరిలోకి దిగనుంది.
1)ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ లలో రికార్డ్ లు ఎలా ఉన్నాయి
ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య 14 మ్యాచ్ లు జరగగా సన్ రైజర్స్ జట్టు 8 మ్యాచ్ లలో గెలుపొందగా , బెంగళూర్ జట్టు 5 మ్యాచ్ లలో నెగ్గింది.ఒక మ్యాచ్ లో ఫలితం తేలలేదు.
2)పిచ్ ఎలా ఉండబోతుంది
ఈ మ్యాచ్ బెంగళూరు లోని చిన్నస్వామి స్టేడియం లో జరగనుంది.ఇక్కడ స్టేడియం లో బౌండరీల దూరం తక్కువగా ఉండడం పిచ్ బ్యాటింగ్ కి అనుకూలించడం తో ఇక్కడ భారీ స్కోర్ లు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి.
3)సన్ రైజర్స్ జట్టు ఎలా ఉండబోతుంది
డేవిడ్ వార్నర్ , బైర్ స్టో లు ఐపీఎల్ నుండి తప్పుకున్నాక వారి స్థానాల లో హైదరాబాద్ జట్టు కి ఎవరు ఆడుతారో అనుకునే సమయం లో మనీష్ పాండే ఫామ్ లోకి వచ్చి వరుసగా మంచి ఇన్నింగ్స్ లు ఆడాడు.గత మ్యాచ్ లో చివరి వరకు అద్భుత పోరాటం చేసి సూపర్ ఓవర్ వరకు తీసుకెళ్లాడు.హైదరాబాద్ జట్టు బౌలింగ్ లో రాణించిన ఆ జట్టు మిడిల్ ఆర్డర్ చాలా బలహీనంగా ఉంది.
ఒకవేళ బెంగళూర్ జట్టు బ్యాటింగ్ ని కట్టడి చేస్తే గెలిచే అవకాశలు ఉంటాయి.
సన్ రైజర్స్ జట్టు ( PROBABLE XI ) – మార్టిన్ గుప్తిల్ , వృద్ధిమాన్ సహా , కేన్ విలియమ్సన్ , మనీష్ పాండే , విజయ్ శంకర్ , మహమ్మద్ నబి ,అభిషేక్ శర్మ , రషీద్ ఖాన్ , భువనేశ్వర్ కుమార్ , సందీప్ శర్మ , ఖలీల్ అహ్మద్
4)రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు ఎలా ఉండబోతుంది
బెంగళూర్ జట్టు గత మ్యాచ్ లో వర్షం కారణంగా ఓటమి నుండి తప్పించుకున్న ఈ మ్యాచ్ లో మాత్రం ఎలాగైనా గెలిచి సీజన్ ని గెలుపు తో ముగించాలనుకుంటుంది.ఇక ఆ జట్టు విదేశ్ ఆల్రౌండర్ అయిన మార్కస్ స్టయినిస్ స్వదేశం కి వెళ్లిపోవడం తో అతని స్థానం లో షిమ్రాన్ హెట్ మేయర్ ఆడే అవకాశం ఉంది.ఇక బౌలింగ్ లో ఉమేష్ యాదవ్ , నవదీప్ సైని లు ఏ విధంగా రాణిస్తారో చూడాల్సిందే.
ఇక ప్రపంచ కప్ ముందు కోహ్లీ ఆడే చివరి క్రికెట్ మ్యాచ్ అవడం తో కోహ్లీ తన బ్యాట్ కి పని చెప్తాడో చూడాల్సిందే.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు ( PROBABLE XI ) – పార్థివ్ పటేల్ , విరాట్ కోహ్లీ , డివిలియర్స్ , షిమ్రాన్ హెట్ మేయర్ , క్లాసెన్ , గురికీరత్ సింగ్ ,పవన్ నేగి , వాషింగ్టన్ సుందర్ , చహల్ , సైని , ఉమేష్ యాదవ్
.