ఈ రోజు ఐపీఎల్ లో రాజస్థాన్ తో సన్ రైజర్స్ మ్యాచ్.. ఏ జట్టుకి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో చూడండి

సన్ రైజర్స్ జట్టు ప్లే ఆప్స్ కి చేరాలంటే తప్పకుండ రాజస్థాన్ రాయల్స్ పైన గెలవాల్సి ఉంది .ప్రస్తుతం సన్ రైజర్స్ ఆడిన 10 మ్యాచ్ లలో 5 విజయాలు సాధించి పాయింట్ ల పట్టికలో 4 వ స్థానం లో ఉంది.

 Sunrisers Hyderabad Versus Rajasthan Royals Match Prediction-TeluguStop.com

రాజస్థాన్ తో ఆడబోయే మ్యాచ్ సన్ రైజర్స్ జట్టు కి చాల కీలకంగా మారనుంది.ఇప్పటికే అద్భుత ఫామ్ లో ఉన్న జానీ బైర్ స్టో స్వదేశానికి వెళ్లిపోవడం తో సన్ రైజర్స్ జట్టు బ్యాటింగ్ ని కాస్త బలహీనంగా మార్చనుంది.

ఇకపోతే కోల్ కత్తా నైట్ రైడర్స్ పైన అద్భుత విజయం సాధించి జోరు మీద ఉన్న ఈ మ్యాచ్ లో కూడా గెలవాలని బరిలోకి దిగనుంది.అజింక్య రహానే ఫామ్ లోకి రావడం ఆ జట్టు బ్యాటింగ్ ని పటిష్టంగా మార్చింది.ఇక గత మ్యాచ్ లో అద్భుత ప్రదర్శనలు చేసిన రియాన్ పరాగ్ , వరుణ్ ఆరోన్ లు ఈ మ్యాచ్ లో కీలకం కానున్నారు.

1)ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ ల రికార్డు లు ఎలా ఉన్నాయి

ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య 10 మ్యాచ్ లు జరగగా సన్ రైజర్స్ జట్టు 6 మ్యాచ్ లలో గెలిచింది .రాజస్థాన్ రాయల్స్ జట్టు 4 మ్యాచ్ లలో విజయం సాధించింది

2)పిచ్ ఎలా ఉండబోతుంది

ఈ మ్యాచ్ జైపూర్ లో జరగనుంది .ఈ పిచ్ పైన పరుగులు చేయడం చాల కష్టం , పిచ్ స్పిన్నర్లకు అనుకూలించనుంది .మొదట బ్యాటింగ్ చేసే జట్టు 165 పరుగుల పైన చేయగలిగితే గెలవడానికి అవకాశాలు ఉంటాయి.లక్ష్య ఛేదన చేయడం అంత తేలికేం కాదు.

3)రాజస్థాన్ రాయల్స్ జట్టు ఎలా ఉండబోతుంది

నైట్ రైడర్స్ జట్టు పైన గెలిచి ఉత్సాహం తో బరిలోకి దిగనున్న రాజస్థాన్ జట్టు ఈ మ్యాచ్ లో జోఫ్రే ఆర్చర్ లేకుండానే బరిలోకి దిగనుంది.అతడిని మినహాయిస్తే జట్టు లో పెద్దగా మార్పులేం ఉండకపోవచ్చు .గత మ్యాచ్ లో టాప్ ఆర్డర్ బ్యాటింగ్ లో విఫలమైనప్పటికీ మిడిల్ ఆర్డర్ లో వచ్చిన రియాన్ పరాగ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టు ని గెలిపించాడు .అతను మరొకసారి రాణిస్తే రాజస్థాన్ మంచి స్కోర్ ని చేయగలదు , ఇకపోతే బౌలింగ్ లో శ్రేయాస్ గోపాల్ , వరుణ్ ఆరోన్ , జయదేవ్ ఉనాద్కత్ లతో పటిష్టంగా కనిపిస్తుంది.

రాజస్థాన్ రాయల్స్ జట్టు (PROBABLE XI ) – అజింక్య రహానే , సంజు శాంసన్ , స్టీవ్ స్మిత్ , ఆస్టన్ టర్నర్ , స్టువర్ట్ బిన్నీ , రియాన్ పరాగ్ , లియామ్ లివింగ్స్టన్ ,ఇష్ సోది , శ్రేయాస్ గోపాల్ , జయదేవ్ ఉనాద్కత్ , వరుణ్ ఆరోన్

4)సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎలా ఉండబోతుంది

చెన్నై జట్టు పైన భారీగా స్కోర్ చేసిన ఆ స్కోర్ ని కాపాడుకోలేకపోయింది .సన్ రైజర్స్ స్టార్ బౌలర్ అయినా రషీద్ ఖాన్ కూడా భారీగా పరుగులు సమర్పించుకున్నాడు.సన్ రైజర్స్ విజయాల్లో ముఖ్య పాత్ర పోషించిన జానీ బైర్ స్టో పాకిస్తాన్ తో సిరీస్ కోసం స్వదేశానికి వెళ్లిపోవడం తో ఆ జట్టు బ్యాటింగ్ లో కాస్త బలహీనం కానుంది.ఇకపో తే చాల మ్యాచ్ తరువాత మంచి ఇన్నింగ్స్ ఆడిన మనీష్ పాండే ఈ మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు కి కీలకం కానున్నాడు.

ఇక బౌలింగ్ లో రషీద్ ఖాన్ , భువనేశ్వర్ లు రాజస్థాన్ ని ఎంత వరకు కట్టడి చేస్తారో అన్నాడని పైనే హైదరాబాద్ జట్టు విజయం ఆధారపడి ఉంది.

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ( PROBABLE XI ) – డేవిడ్ వార్నర్ , కేన్ విల్లియంసన్ , మనీష్ పాండే , షకీబ్ ఆల్ హాసన్ , విజయ్ శంకర్ , వృద్ధిమాన్ సహా , దీపక్ హూడా , భువనేశ్వర్ కుమార్ , రషీద్ ఖాన్ , సందీప్ శర్మ , ఖలీల్ అహ్మద్

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube