బాహుబలి 3 లో హీరో నేనే అంటున్న సన్ రైజర్స్ క్రికెటర్! షూటింగ్ స్టార్ట్ చేద్దామన్న రాజమౌళి

టాలీవుడ్ లో తెరకెక్కిన బాహుబలి సిరిస్ దేశ వ్యాప్తంగా ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికి తెలిసిందే.ఇక ఈ సినిమాతో మన ఇండియన్ సినిమా సత్తా ప్రపంచ స్థాయిలో అందరికి తెలిసింది.

 Sunrisers David Warner Announce To Act In Bahubali 3 Movie-TeluguStop.com

ఈ కారణంగానే ఇప్పుడు తారక్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో హాలీవుడ్ హీరోయిన్ కూడా నటించడానికి ముందుకొచ్చింది.అలాగే ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సాహో సినిమాలో హాలీవుడ్ పాప్ సింగర్ ఐటెం సాంగ్ చేయడానికి సిద్ధం అవుతుంది.

హాలీవుడ్ ద్రుష్టిలో కూడా ఇండియన్ సినిమా స్టాండర్డ్ బాహుబలి సినిమా తర్వాత పెరిగింది అనేది కచ్చితంగా ఒప్పుకోవాల్సిన మాట.

ఇదిలా ఉంటే బాహుబలి సినిమా రిలీజ్ అయ్యి రెండు సంవత్సరాలు దగ్గర అవుతున్న ఇప్పటికి ఆ సినిమా ప్రభావం ఎ స్థాయిలో ఉందో చెప్పడానికి తాజాగా డేవిడ్ వార్నర్ చెప్పిన మాటలు ఉదాహరణగా చెప్పొచ్చు.సన్ రైజర్స్ జట్టు తరుపున ఐపీఎల్ మెరుపులు మెరిపిస్తున్న ఆస్ట్రేలియా డాషింగ్ బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్ తాజాగా ఆసక్తికరమైన వాఖ్యలు చేసారు.తనకి బాహుబలి 3లో హీరోగా చేయాలని ఉంది అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక ఆ సినిమాలో తనని తాను చూసుకోవాలని అంటుకుంటున్న అని మీడియాతో చెప్పాడు.దీనిపై బాహుబలి టీం నుంచి ఆసక్తికరమైన ట్వీట్ తో రిప్లయ్ ఇచ్చారు.త్వరలో బాహుబలి 3 సినిమా షూటింగ్ స్టార్ట్ చేద్దాం అంటూ ప్రకటించారు.అయితే ఇదంతా సరదాగా జరిగిన సంభాషణ అయిన బాహుబలి క్రేజ్ మాత్రం మరో సారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube