సిరి, షణ్ముఖ్ రిలేషన్‌పై స్టేజిపైనే సన్నీ ఓపెన్ కామెంట్స్.. అందరూ షాక్?

బుల్లితెరపై ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 5 నిన్నటితో పూర్తిగా ముగిసింది.ఫైనల్ కు చేరుకున్న ఐదుగురు కంటెస్టెంట్ లు కూడా సంతోషంగా తమ ఇళ్లల్లో కి చేరుకున్నారు.

 Sunny Open Comment - On Siri And Shanmukh Relationship On Stage Everyone Shock S-TeluguStop.com

మొత్తం 19 మంది కంటెస్టెంట్ లతో ప్రారంభమైన ఈ షో నిన్నటితో ముగిసిపోయింది.ఇక టైటిల్ విన్నర్ గా సన్నీ గెలిచిన సంగతి తెలిసిందే.

బుల్లితెర నటుడు సన్నీ పలు సీరియల్స్ లో నటించి మొత్తానికి బిగ్ బాస్ హౌస్ లో పరిచయాన్ని మరింత పెంచుకోవడానికి అడుగు పెట్టాడు.ఇక షో ప్రారంభం నుండి చివరి రోజు వరకు సన్నీ ఇతర కంటెస్టెంట్ ల నుండి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.

ఎన్నో మాటలు పడ్డాడు.

కాని చివరికి సన్నీ నిజస్వరూపాన్ని ప్రేక్షకులే తెలుసుకున్నారు.

చివరికి అతడే గెలుస్తాడు అని ఎంతోమంది సోషల్ మీడియాలో ప్రకటించారు.మొత్తానికి ప్రేక్షకుల ఆదరణ ఉండటంతో సన్నీ టైటిల్ విన్నర్ గా నిలిచాడు.

ఈ సీజన్ లో సన్ని గెలవడంతో ఎంతోమంది ప్రేక్షకులు తెగ సంతోష పడ్డారు.

Telugu Bigg Boss, Relationship, Shannu, Siri, Stage, Sunny, Telugu-Movie

సోషల్ మీడియాలో సన్నీకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.సన్నీ కూడా తన గెలుపుకు కారణమైన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపాడు.ఇక సన్నీ నిన్నటి ఎపిసోడ్ లో వేదికపై తాను గెలిచిన సందర్భంగా కాస్త ఎమోషనల్ ఫీల్ అయ్యాడు.

కొన్ని విషయాలు కూడా పంచుకున్నాడు.

Telugu Bigg Boss, Relationship, Shannu, Siri, Stage, Sunny, Telugu-Movie

ఇక వేదికపై మాట్లాడుతూ.మొదట ప్రతి ఒక్కరికీ థాంక్స్ చెప్పుకున్నాడు.ఇక బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ అనే మూమెంట్ మాటల్లో లేదు మోస్ట్ థాంక్యూ థాంక్యూ సోమచ్ అని, అందరికీ పాదాభివందనాలు అంటూ బాగా ఎమోషనల్ గా ఫీల్ అయ్యాడు.

ఇక హౌస్ లో పాల్గొన్న కంటెస్టెంట్ లకు  కూడా థాంక్స్ చెప్పుకుంటూ.ఇటువంటి జర్నీ మర్చిపోలేను అని పంచుకున్నాడు.

ఏ సీజన్ లో లేనిది ఈ సీజన్ లో ప్రామిస్ చేసుకున్నాం అంటూ.ఎంత కొట్టుకున్నా మళ్లీ కలిసి పోయే వాళ్ళమని అన్నాడు.

ఇక నాగార్జున కు ఐ లవ్ యూ అని సంతోషంగా చెప్పుకున్నాడు.తనకు ఆలియా భట్ చెప్పింది అంటూ అది మరో పెద్ద గిఫ్ట్ అంటూ కానీ ఇక్కడికి రావడానికి కారణం ప్రేక్షకులే అని.

Telugu Bigg Boss, Relationship, Shannu, Siri, Stage, Sunny, Telugu-Movie

అందరికీ మాటిస్తున్నాను అని.నేను ఉన్నంతవరకు, నావల్ల అయినంత వరకు ఎంటర్ టైన్ చేస్తూనే ఉంటాను అని తెలిపాడు.తన తల్లి గురించి కూడా కొన్ని విషయాలు పంచుకున్నాడు.తన తల్లికి తను అందుకున్న కప్పును అందించి చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యాడు.

ఇక ముఖ్యంగా హౌస్ లో ఉన్నంత కాలం తనను టార్గెట్ చేసిన షణ్ముఖ్, సిరి ల గురించి స్టేజి పైనే ఓపెన్ కామెంట్స్ చేశాడు.షన్ను గురించి ఇక్కడే క్లారిటీగా ఇస్తాను సార్ అంటూ.

ఎందుకంటే ఇది స్టేజ్ మీదనే మాట్లాడాలి అని.షణ్ముఖ్, సిరి.అలాంటి మంచి ఫ్రెండ్ దొరకడం అదృష్టం.నాకు మానస్ కి ఎలాంటి స్నేహమైతో ఉందో వారి మధ్య కూడా అదే స్నేహం ఉంది అని తెలిపాడు.ఇక షన్ను సన్నీని వెంటనే హగ్ చేసుకున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube