మగవాళ్లపై సన్నీలియోన్‌కు ఎంత ప్రేమ, అభిమానం చూడండి

సన్నీలియోన్‌.ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

 Sunny Leonetalking About Castingcouch-TeluguStop.com

ఆమె ఏ స్థాయి స్టార్‌ అనే విషయం అందరికి తెల్సిందే.గతంలో బూతు సినిమాలు చేసిన ఆమె ఆ తర్వాత వాటిని మానేసి బాలీవుడ్‌ సినిమాలు చేసింది.

సౌత్‌లో తమిళం మరియు తెలుగు సినిమాలను కూడా సన్నీలియోన్‌ చేసింది.సన్నీలియోన్‌ గురించి చాలా మంది చాలా రకాలుగా అనుకుంటూ ఉంటారు.

కాని ఆమె మంచి మనసున్న వ్యక్తి అంటూ ఆమె పెంచుకుంటున్న పిల్లలను చూస్తే అర్థం అవుతుంది.

Telugu Problems, Sunny Leone, Womensproblems-

ఇక గతంలో ఇండస్ట్రీలో ఆడవారు ఎదుర్కొంటున్న వేదింపులపై తన గళం వినిపించి మద్దతుగా నిలిచింది.ఇప్పుడు మగవారి తరపున మాట్లాడి మరోసారి తన మంచి మనసును చాటుకుంది.ఈ అమ్మడు ఇటీవల ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఇండస్ట్రీలో ఉన్న కాస్టింగ్‌ కౌచ్‌ మరియు వేదింపుల గురించి స్పందించింది.

ఆడవారు కాస్టింగ్‌ కౌచ్‌ వల్ల బలైపోతున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

Telugu Problems, Sunny Leone, Womensproblems-

ఇదే సమయంలో సన్నీలియోన్‌ మాట్లాడుతూ.ఇండస్ట్రీలో మగవారు కూడా వేదింపులకు గురవుతున్నట్లుగా తన దృష్టికి వచ్చింది.కాని చాలా మంది మగవారు ఆ వేదింపులను బయటకు చెప్పుకోవడం లేదు.

ముఖ్యంగా లైంగికంగా కూడా మగవారు వేదింపులకు గురి అవుతున్నారు.ఆ విషయాన్ని వారు చెప్పుకునేందుకు మొహమాటం మరియు సిగ్గు అడ్డు వస్తుందని సన్నీ చెప్పుకొచ్చింది.

మగవారు కూడా మీటూ అంటూ లైంగిక వేదింపులకు వ్యతిరేకంగా పోరాడాల్సిన సమయం వచ్చిందంటూ ఈ సందర్బంగా పిలుపునిచ్చింది.మొత్తానికి మగవారిపై సన్నీ చూపించిన అభిమానంకు అంతా ఫిదా అవుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube