సన్నీ లియోన్‌ షాకింగ్‌ సమాధానం

మాజీ పోర్న్‌ స్టార్‌ సన్నీలియోన్‌ తాజాగా ఒక కండోమ్‌ యాడ్‌లో నటించింది.ఆ యాడ్‌ దేశంలో రేప్‌లను మరింతగా పెంచేదిగా ఉంది అంటూ కామ్రెడ్‌ నేత అతుల్‌ కుమార్‌ విమర్శించిన విషయం తెల్సిందే.

 Sunny Leone’s Strong Reply To Cpi Leader Atul Kumar-TeluguStop.com

దాంతో దేశ వ్యాప్తంగా ఆ కండోమ్‌ యాడ్‌పై చర్చ జరిగింది.కొందరు అతుల్‌ విమర్శలకు మద్దతు ఇవ్వగా మరి కొందరు మాత్రం అతుల్‌ విమర్శిస్తున్నట్లుగా అందులో ఏం లేదని, రేప్‌లకు ఆ యాడ్‌ ఎలా కారణం అవుతుందంటూ సన్నీకి మద్దతు తెలిపారు.

తాజాగా ఈ వివాదంపై సన్నీలియోన్‌ తనదైన స్టైల్‌లో స్పందించింది.

తాజాగా ట్విట్టర్‌ ద్వారా అతుల్‌ కుమార్‌ పేరును ప్రస్థావించకుండా ఈమె స్పందిస్తూ… కొందరు నాయకులు తమ పవర్‌ను దుర్వినియోగం చేస్తున్నారు.

వారిపై ఆధారపడ్డ వారికి సాయం చేయకుండా ఇతర విషయాలపై కామెంట్స్‌ చేస్తూ వారి ఎనర్జీని వృదా చేసుకుంటున్నారు అంటూ ట్వీట్‌ చేసింది.సన్నీలియోన్‌ అన్నది కరెక్ట్‌ అని కొందరు అంటున్నారు.

అనవసర విషయాలను ఎక్కువగా పట్టించుకుంటే ప్రజల్లో చులకన అవ్వడం ఖాయం అని, అందుకే రాజకీయ నాయకులు తమ బాధ్యతను దృష్టిలో పెట్టుకుని మసలుకోవాలని కోరుకుందాం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube