సన్నీలియోన్‌పై కన్నడ ప్రజలకు ఎందుకు ఇంత కక్ష... అప్పుడు అలా, ఇప్పుడు ఇలా!!   Sunny Leone's Posters Were Destroyed By Karnataka Rakshana Vedike     2018-10-10   11:57:15  IST  Ramesh P

మాజీ శృంగార తార సన్నీలియోన్‌ బాలీవుడ్‌ చిత్రాలతో చాలా బిజీగా ఉంటున్న విషయం తెల్సిందే. బాలీవుడ్‌లో ఇంత బిజీగా ఉన్నా కూడా సౌత్‌లో ఈమె నటించేందుకు ముందుకు వస్తుంది. తాజాగా ఈమె తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం భాషల్లో ‘వీరమహాదేవి’ అనే చిత్రాన్ని చేస్తోంది. నాలుగు భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతున్న కారణంగా అంచనాలు భారీగా ఉన్నాయి. భారీ ఎత్తున రూపొందుతున్న ఈ చిత్రంకు సంబంధించిన చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఇలాంటి సమయంలో కన్నడ ప్రజా సంఘాల వారు వెంటనే వీర మహాదేవి చిత్రాన్ని ఆపేయాలంటూ ఆందోళన చేపట్టారు.

కన్నడ ప్రజల ఆరాధ్యదైవంగా భావించే వీరనారి వీర మహావేది పాత్రను శృంగార తార సన్నీలియోన్‌ చేయడంను కన్నడ ప్రజా సంఘాల వారు ఒప్పుకోవడం లేదు. వెంటనే సినిమా చిత్రీకరణ ఆపేయాలని, లేదు అంటూ అంతే షూటింగ్‌ ను కంటిన్యూ చేసి, సినిమాను విడుదల చేస్తే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. సన్నిలియోన్‌ ఈ చిత్రంలో చాలా పవర్‌ ఫుల్‌గా కనిపించబోతుందని ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌తో తేలిపోయింది. అందుకే ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Sunny Leone's Posters Were Destroyed By Karnataka Rakshana Vedike-

సినిమాకు మంచి క్రేజ్‌ ఉన్న ఈ సమయంలో కన్నడ ప్రజా సంఘాల వారు చేస్తున్న ఆందోళనతో చిత్ర యూనిట్‌ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సన్నీలియోన్‌ శృంగార తార అయినంత మాత్రాన ఏమవుతుందని, వీరమహాదేవి గురించి చాలా మంచి కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, ఆమె ప్రతిష్టకు ఏమాత్రం భగం వాటిళ్లకుండా ఈ చిత్రంను తెరకెక్కిస్తున్నట్లుగా చిత్ర దర్శక నిర్మాతలు కన్నడ ప్రజా సంఘ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నారు. కాని వారు మాత్రం వినే పరిస్థితి లేదు.

Sunny Leone's Posters Were Destroyed By Karnataka Rakshana Vedike-

గతంలో కూడా కర్ణాటకలో ఒక న్యూఇయర్‌ పార్టీలో పాల్గొనేందుకు సన్నీలియోన్‌ వస్తుందనే విషయం తెలిసి ప్రజా సంఘాల వారు ఆందోళన చేశారు. నిర్వాహకులు భారీ పారితోషికం ఆమెకు ఇచ్చి మరీ బుక్‌ చేశారు. కాని కార్యక్రమం నిలిచిపోయింది. ఒకప్పటి శృంగార తార అవ్వడం వల్ల కన్నడ ప్రజా సంఘాల వారు సన్నీలియోన్‌ ను ఇంకా కూడా ఆ ఉద్దేశ్యంతోనే చూస్తున్నారనిపిస్తుంది. అందుకే అప్పుడు అలా, ఇప్పుడు ఇలా. ఈ వివాదం ఎక్కడకు దారి తీస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.