కాలేజ్ టాప‌ర్‌గా స‌న్నీ లియోన్‌.. ఏ కాలేజీకి అంటే?

పోర్న్ వీడియోల ద్వారా కోట్ల సంఖ్యలో అభిమానులను సొంతం చేసుకున్న సన్నీ లియోన్ గురించి తెలియని సినీ అభిమానులు లేరంటే పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.బాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్టులలో నటిస్తూ సన్నీ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.

 Sunny Name Makes It To Top Of Kolkata Colleges Merit List  Sunny Leone, Kolkata-TeluguStop.com

అయితే ఎప్పుడూ సినిమా వార్తల ద్వారా వార్తల్లో నిలిచే సన్నీ తాజాగా మరో విధంగా వార్తల్లో నిలవడం గమనార్హం.ప్రస్తుతం లాస్ ఏంజిల్స్ లో ఉన్న సన్నీ కోల్ కతా లోని అషుతోష్‌ కాలేజీలో అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ కోసం కొన్ని నెలల క్రితం దరఖాస్తు చేసినట్టు వార్త వైరల్ అవుతోంది.

తాజాగా అషుతోష్ కాలేజీ యాజమాన్యం అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం మెరిట్ జాబితాను విడుదల చేసింది.దీనిలో సన్నీ లియోన్ పేరు ఉండటంతో ఆమె అభిమానులు సైతం అవాక్కయ్యారు.

కొందరు అభిమానులు సన్నీ డిగ్రీ చదవడానికి ఆసక్తి చూపుతుందేమోనని అనుకున్నారు.బీఏ(ఆనర్స్‌) ప్రవేశానికి నిర్వహించిన పరీక్ష ఫలితాల జాబితాలో టాపర్ గా సన్నీలియోన్ పేరు ఉంది.

అందులో సన్నీ లియోన్ పేరు ఉండటం కాలేజీ యాజమాన్యాన్ని సైతం ఆశ్చర్యపరిచింది.

కాలేజీ వెబ్ సైట్ లో సన్నీ లియోన్ పేరుతో పాటు ఆమెకు సంబంధించిన ఇతర వివరాలు సైతం ఉన్నాయి.

అందరు ఇంటర్ సెకండియర్ లో నాలుగు బెస్ట్ సబ్జెక్ట్ లలో 400కు 400 మార్కులు సాధించినట్లు అందులో ఉంది.అయితే ఈ వార్త వైరల్ కావడంతో అషుతోష్ కాలేజీ యాజమాన్యం స్పందించి వివరణ ఇచ్చింది.

ఎవరో ఆకతాయిలు చేసిన పని వల్ల కాలేజీ టాపర్ గా సన్నీ పేరు కనిపిస్తోందని సంజాయిషీ ఇచ్చుకుంది.సన్నీ అభిమానులు సన్నీని కాలేజీ టాపర్ గా ఎందుకు చేశారో తెలియాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube