కట్స్‌ లేకుండా బూతు చిత్ర సెన్సార్‌

బాలీవుడ్‌లో ఇటీవల ‘మస్తీ జాదే’ చిత్ర ట్రైలర్‌ ఎంతటి సంచలనాన్ని క్రియేట్‌ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.పచ్చి బూతు చిత్రంలా మస్తీ జాదే ఉండబోతుంది అనేందుకు ఆ ట్రైలర్‌ సాక్షం.

 Sunny Leone’s “mastizaade” Given Clean Chit By The Sensor-TeluguStop.com

ట్రైలర్‌లోనే అంత చూపించి ఉంటే ఇక సినిమాలో మరెంత బూతు ఉంటుందో అంటూ ప్రేక్షకులు భావించారు.ఈ చిత్రం సెన్సార్‌ గేటు దాటి వచ్చేనా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి.

కాని సెన్సార్‌ బోర్డు షాక్‌ ఇచ్చేలా ఈ సినిమా సెన్సార్‌ చేసింది.

పోర్న్‌ చిత్రాన్ని తలపించేలా ఉన్న ఈ సినిమాకు ఎలాంటి కట్స్‌ లేకుండా సెన్సార్‌ పూర్తి చేయడం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా ఉంది.

‘మస్తీ జాదే’ వంటి సంచలన సినిమాకు ఎలాంటి కట్స్‌ ఇవ్వక పోవడం వెనుక ఉద్దేశ్యం ఏంటో అంటూ కొందరు అంటున్నారు.సెన్సార్‌ బోర్డు సభ్యులు ప్రలోభాలకు లోబడి సెన్సార్‌ చేస్తున్నారు అని, డబ్బులు తీసుకుని సెన్సార్‌ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు అంటూ విమర్శలు వస్తున్నాయి.

అయితే బాలీవుడ్‌ సెన్సార్‌ బోర్డు సభ్యులు మాత్రం సినిమాను బట్టి సెన్సార్‌ చేస్తాం తప్ప, ఇతర అంశాలు మా పరిగణలోకి రావు అంటున్నారు.మరి సెన్సార్‌ బోర్డులో ఎలాంటి ప్రలోభాలు, అవినీతి జరుగుతుందో అనేది కేంద్రం పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube