బుర్రకథ చెప్పబోతున్న సన్నిలియోన్

సన్నిలియోన్ కి చేతిలో మంచి ఆఫర్లే ఉన్నాయి.ఈరోజు కూడా సన్ని నటించిన ” వన్ నైట్ స్టాండ్” అనే హిందీ చిత్రం విడుదలైంది.

 Sunny Leone’s Cameo In Telugu Film Burrakatha-TeluguStop.com

రయీస్ లో షారుఖ్ తో ఐటమ్ సాంగ్ లో నర్తించింది.యాడ్స్, సినిమాలు, షాప్ ఓపెనింగ్స్ ,బానే సంపాదిస్తోంది సన్ని.

అన్నీ బాగానే ఉన్నాక ఈ బుర్రకథ గోల ఏంటి అనుకుంటున్నారా!

వస్తున్నా, అక్కడికే వస్తున్నా.సన్నిలియోన్ మరోసారి తెలుగు సినిమాలో కనిపించనుంది.

గత ఏడాది మంచు మనోజ్ – రకుల్ ప్రీత్ కలిసి నటించిన “కరెంట్ తీగ”లో ప్రత్యేక పాత్రతోపాటు, ప్రత్యేక గీతంలో కనిపించిన సన్నీ, ఇప్పుడు మళ్ళీ అదే తరహా పాత్రలో కనిపించనుంది.

సన్ని నటించబోయే తెలుగు సినిమాపేరే బుర్రకథ.

అందాల రాక్షసి ఫేమ్ నవీన్ చంద్ర ఇందులో హీరోగా నటిస్తున్నాడు.సంజీవ్ అనే నూతన దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు.

కొన్ని సన్నివేశాలతో పాటు, ఒక ఐటమ్ సాంగ్ లో సన్ని కనిపిస్తుందట.సన్నీకి సంబంధించిన షూట్ జూన్ లో మొదలవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube