హాట్ బ్యూటి సన్నిలియోన్ కి కొత్త కోరికలు పుడుతున్నాయి.ఒకప్పుడు పోర్న్ స్టార్ గా, ఇప్పుడు బాలివుడ్ నటిగా బాగానే సంపాదించినా, ఉన్నది సరిపోవేమో కొత్త బిజినెస్ మొదలుపెట్టే ఆలోచనల్లో ఉందట.
ఇంతకి సన్ని మొదలుపెట్టాలనుకుంటున్న కొత్త బిజినెస్ ఏంటో తెలుసా? సినిమా నిర్మాణం.అవును సన్ని సినిమాలు నిర్మించాలనుకుంటోంది.
” నాకు తెలుసు అన్ని రకాల పాత్రలు చేయాలని నాకున్నా, అవి నా దగ్గరకి రావని.నా గతం వలన నన్ను ఒకేరకమైన పాత్రలకి పరిమితం చేస్తున్నారు.
అందుకు నేనేమి బాధపడటం లేదు.ఎందుకంటే నేను ఇక్కడి దాకా వచ్చానంటే అది నా గతం వలనే.
అందుకే నేను నిర్మాతగా మారాలనుకుంటున్నాను.మంచి సినిమాలు తీస్తూనే కొత్తవారికి అవకాశాలు ఇస్తాను.
అలాగే నేను ఈ పాత్రకు న్యాయం చేయగలను అని ఎప్పుడు అనిపించినా, నన్ను నేను మంచి నటిగా నిరూపించుకుంటాను ” అని మనసులోని మాట బయటపెట్టింది సన్ని.
సన్ని ప్రస్తుతం మస్తిజాదే అనే హింది చిత్రంతో బిజిగా ఉంది.