అతడితో ఒక్క సెకండ్ అవకాశం దొరికానా చాలు - సన్నీ లియోన్

నిజంగానే అంత వెర్రి ఉందో, లేక తన కొత్త సినిమా ప్రమోషన్ బాగా జరగాలని చేస్తోందో తెలియదు కాని, ఆమీర్ ఖాన్ ని ఇంతవరకు ఏ అభిమాని పొగడనంతాగా పొగిడేస్తూ , ఆమీర్ భార్య కూడా పబ్లిక్ లో వ్యక్తపరచనంత ప్రేమ కురిపిస్తోంది సన్నీ లియోన్.అసలు అక్కడ అడిగిన ప్రశ్నేంటి, తానూ చెబుతున్న సమాధానం ఏంటి అని కూడా చూడకుండా ఎదో మైకం కమ్మేసినట్టు ఆమీర్ జపం చేస్తోంది సన్నీ.

 Sunny Leone Wants At Least A Second With Aamir-TeluguStop.com

ఈ పొగడ్తలు విని విని మనకే కాదు, ఎదో ఒకరోజు ఆమీర్ కి ఖచ్చింతంగా విసుగోస్తుందేమో.ఇంతకుముందే జాతీయ న్యూస్ ఛానెల్ ఎన్ డి టివితో మాట్లాడింది సన్నీ.

” నాకు ఆమీర్ తో ఒక్క సెకండ్ నటించే అవకాశం దొరికినా , ప్రపంచంలో ఎప్పటికి నాకన్నా సంతోషపడే అమ్మాయి ఉండదు.కనీసం ఆయన్ని దగ్గరినుంచి చూసే అవకాశం దొరికినా, చాలా చాలా సంతోషిస్తాను.

నా ఒక్కదానికే కాదు, నాకు తెలిసి ఆడ – మగ తేడా లేకుండా,ఏ యాక్టర్ కి అయినా, అలాంటి అద్భుతమైన నటుడితో, అద్భుతమైన మనిషితో పనిచేయడం ఒక కల ” అంటూ చేసిన భజనే మళ్ళి చేసింది సన్నీ లియోన్.

ఏమయ్యా ఆమీర్ ఖాను … అంతలా ముచ్చటపడుతోంది, నీకున్న అభిమానుల్లో ఇంతకన్నా వెర్రి అభిమాని ఇంకొకరు ఉండరేమో .ఒక ఛాన్స్ ఇచ్చేయ్ .

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube