పుష్పలో ఐటమ్ సాంగ్‌కు సన్నీ భారీ డిమాండ్.. ఎంతంటే?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఆర్య, ఆర్య 2 చిత్రాలు ప్రేక్షకులను ఎలా ఆకట్టుకున్నాయి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సారి “పుష్ప” అనే పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతోంది.

 Sunny Leone Shocking Remuneration For Pushpa Special Song-TeluguStop.com

ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక సందడి చేయనున్నారు.గంధం చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ తో పోటీ పడటానికి మలయాళ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ విలన్‌ పాత్రలో కనిపిస్తున్నారు.

ఇక ఈ అద్భుతమైన కాంబినేషన్ లో వస్తున్నటువంటి ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు.రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఎలా ఉంటుందో ఇదివరకే ఎన్నో సినిమాలలో చూసాము.

 Sunny Leone Shocking Remuneration For Pushpa Special Song-పుష్పలో ఐటమ్ సాంగ్‌కు సన్నీ భారీ డిమాండ్.. ఎంతంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే పుష్ప సినిమాలో ఆర్య, ఆర్య 2 సినిమాలలో కంటే అద్భుతంగా ఈ సినిమాలో ఒక ప్రత్యేక పాటను తెరకెక్కించాలని డిఎస్పీ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఈ ఐటెం సాంగ్ లో బన్నీ సరసన నటించడం కోసం పలువురు తారల పేర్లు తెరపైకి వచ్చాయి.

Telugu Actress Sunny Leone, Actress Sunny Leone Demanding High Remuneration For Pushpa Movie Item Song, Allu Arjun, Pushpa Movie Item Song, Pushpaka Specal Song-Movie

మొదట్లో ఈ సినిమాలో ప్రత్యేక పాటలో నటించడం కోసం చిత్రబృందం దిశాపటాని సంప్రదించినట్లు వార్తలు వినిపించాయి.ఆ తర్వాత తెరపైకి ఊర్వశి రౌటేలా పేరు వచ్చింది.ఇక తాజాగా ఆమె స్థానంలో బాలీవుడ్ బ్యూటీ సన్నీలియోన్ పేరు వినబడుతోంది.ఈ బ్యూటీ పుష్పా సినిమాలో అల్లు అర్జున్ సరసన ప్రత్యేక పాటలో చేయడం కోసం భారీగానే రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.

Telugu Actress Sunny Leone, Actress Sunny Leone Demanding High Remuneration For Pushpa Movie Item Song, Allu Arjun, Pushpa Movie Item Song, Pushpaka Specal Song-Movie

కేవలం ఒక ఐటమ్ సాంగ్ కోసం మాత్రమే ఈ బ్యూటీ ఏకంగా 90 లక్షల రూపాయల రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందని వార్త వినబడుతుంది.ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ మార్కెట్లో అధిక డిమాండ్ ఉండటం చేత ఆమె అడిగినంత ఇవ్వడానికి మేకర్స్ కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.ఇకపోతే ఈ సినిమా రెండు భాగాలుగా ఉండబోతోందని, మొదటి పార్ట్ ఈ ఏడాదిలో విడుదల కాగా రెండో పార్ట్ వచ్చే ఏడాది చివర్లో విడుదల చేయాలనే ఆలోచనలో దర్శకుడు ఉన్నట్లు తెలుస్తోంది.

#ActressSunny #ActressSunny #Pushpaka Specal #Pushpa Item #Allu Arjun

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు