శృంగారతారగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుని వరుసగా సినిమా ఆఫర్లను అందిపుచ్చుకుంటూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు సన్నీలియోన్.నార్త్ ఇండియాలో సినిమాలతో పాటు సౌత్ ఇండియాలోని సినిమాల్లో కూడా నటిస్తూ సందడి చేస్తున్న సన్నీలియోన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిన్న వయస్సులో ఎదుర్కొన్న చెడు అనుభవాల గురించి చెప్పుకొచ్చారు.
పాఠశాలలో చదువుకునే సమయంలో తనను తోటి విద్యార్థులు ఏడిపించేవారని ఆమె అన్నారు.
తాను ఇండియన్ అమ్మాయిని కావడం వల్ల కెనడాలో ఇతర విద్యార్థులతో పోలిస్తే నల్లగా కనించేదాననినని అందువల్ల కొందరు అవహేళన చేసేవారని ఆమె అన్నారు.
తాను సరైన దుస్తులు ధరించేదానిని కాదని కూడా కొందరు కామెంట్లు చేశారని సన్నీ పేర్కొన్నారు.ఆ సమయంలో తాను సన్నగా ఉండేదానినని.తన జుట్టు, తాను నలుపు రంగులో ఉండటం వల్ల కొందరు ఆ విధంగా కామెంట్లు చేసేవారని పేర్కొన్నారు.
పాఠశాలల్లో ఇలాంటి ఘటనలు సాధారణంగా చోటు చేసుకుంటాయని అన్నారు.అయితే ఇతర విద్యార్థులు చేసిన కామెంట్లను తాను అనుభవాలుగా మలచుకున్నానని అన్నారు.ఎవరైనా బెదిరించినా, అవహేళన చేసినా ధైర్యంగా ముందడుగు వేయాలని సూచనలు చేశారు.
సన్నీలియోన్ ఇండియన్ పంజాబీసిక్ కుటుంబంలో జన్మించగా ఆమె తల్లిదండ్రులు 13 సంవత్సరాల వయస్సులో అమెరికాకు వలస వెళ్లారు.
15 సంవత్సారల వయస్సులో సన్నీ ఒక జర్మన్ బేకరీలో పని చేశారు.19 ఏళ్ల వయస్సు నుంచే అడల్ట్ సినిమాల్లో నటించడం మొదలుపెట్టిన సన్నీ 42 అడల్ట్ సినిమాలకు దర్శకత్వం వహించడం గమనార్హం.సన్నీ 300 మంది పిల్లలు ఒక పాఠశాలను దత్తత తీసుకుని అక్కడ చదివే విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలను అందించారు.ఇండియన్ రియాలిటీ షో బిగ్ బాస్ షోలో కూడా సన్నీ పాల్గొన్నారు.2015 సంవత్సరంలో మన దేశంలో ఎక్కువమంది నెటిజన్లు వెతికిన పేరు ఈమెదే కావడం గమనార్హం.