అయ్యో.! పాపం సన్నిలియోన్

మొన్న నేషనల్ మీడియా మొత్తం ఆమీర్ ఖాన్ తో సన్ని లియోన్ నటించబోతోంది అని రాసింది.అభినయ్ డియో ఆమీర్ కోసం ఒక కథ రాసాడని, అందులో సన్ని లియోన్ ది ప్రత్యేక పాత్ర అని గాసిప్పులు వచ్చాయి.

 Sunny Leone Isn’t There In Aamir Khan’s Next-TeluguStop.com

సన్ని కూడా ఈ వార్త విని చాలా ఆనందపడిందట.కాని పాపం, ఆనందం ఒక్కరోజు కూడా సరిగా నిలువకుండా… నిన్న ఈ రూమర్స్ ని కొట్టిపడేసాడు ఆమీర్.

“నేను దంగల్ తరువాత ఏ సినిమా ఒప్పుకోలేదు.సన్నిలియోన్ నా తదుపరి చిత్రంలో నటించబోతున్నది నిజం కాదు.

అయితే నేను సన్నితో నటించడానికి ఇష్టపడతాను.ప్రస్తుతం నా ఫోకస్ అంతా దంగల్ మీదే ఉంది.

ఇది పూర్తయితే కాని మిగితా విషయాల గురించి ఆలోచించలేను” అంటూ చెప్పుకొచ్చాడు ఆమీర్.

సన్ని ప్రస్తుతం రెండు హిందీ సినిమాల్లో కథానాయికగా చేస్తూనే, షారుఖ్ ఖాన్ రాయీస్ లో ఐటమ్ భామగా కనిపించబోతోంది.

మరి అమీర్ ఖాన్ ఇచ్చిన మాట మీద ఎప్పుడు నిలబడతాడో, సన్నిలియోన్ కి అవకాశం ఎప్పుడిస్తాడో!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube