సూపర్‌స్టార్‌ సినిమాలో సన్నీలియోన్‌?     2015-01-27   10:00:33  IST  Raghu V

‘మిర్చి’ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మహేష్‌బాబు హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ చిత్రం ప్రస్తుతం చివరి దశ చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సినిమాలో మహేష్‌బాబు సరసన హీరోయిన్‌గా శృతిహాసన్‌ అందాలు ఆరబోయనుంది. ఈమె అందాలు చాలవన్నట్లు దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాలో పోర్న్‌స్టార్‌ సన్నీలియోన్‌ అందాలను ఆరబోయించాలని చూస్తున్నాడు. సన్నీలియోన్‌తో ఒక ఐటెం సాంగ్‌ చేయించేందుకు దర్శకుడు కొరటాల శివ ప్లాన్‌ చేస్తున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యుల ద్వారా సమాచారం అందుతోంది. ఇందుకు మహేష్‌బాబు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడని ఫిల్మ్‌ వర్గాల నుండి వార్తలు వస్తున్నాయి.

భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ సినిమాలో సన్నీలియోన్‌ ఐటెం సాంగ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నట్లుగా తెలుస్తోంది. మహేష్‌బాబు సినిమాలు వరుసగా ఫ్లాప్‌ అవుతూ వస్తుండటంతో అందరి దృష్టి ప్రస్తుతం ఈ సినిమాపైనే ఉంది. ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్‌ అయ్యేలా చేయాలంటూ దర్శకుడు కొరటాల శివను సూపర్‌ ఫ్యాన్స్‌ కోరుతున్నారు. ఇక మహేష్‌బాబు కూడా ఈ సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నాడు. ‘మిర్చి’ వంటి కమర్షియల్‌ సక్సెస్‌ను అందుకున్న కొరటాల ఈ సినిమాను కూడా అదే స్థాయిలో తెరకెక్కించి సక్సెస్‌ను కంటిన్యూ చేయాలని భావిస్తున్నాడు. అందుకోసమే ఈ సినిమాలో పలు ప్రయోగాలను దర్శకుడు చేస్తున్నాడు. మరి సన్నీలియోన్‌ ఐటెం సాంగ్‌ ఈ సినిమా సక్సెస్‌లో ఏమేరకు హెల్ప్‌ అయ్యేనో చూడాలి.