ఆ హీరో షాంపూ యాడ్‌కు కూడా పనికిరాడన్నారు.. ఇప్పుడు?

సాధారణంగా ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే కేవలం సినీ బ్యాక్ గ్రౌండ్ అయినా ఉండాలి లేదంటే.నటనలో నైపుణ్య మైన ఉండాలి.

 Sunny Kaushal Recalls Being Rejected For Shampoo Ad-TeluguStop.com

ఈ రెండూ ఉన్నప్పుడే ఇండస్ట్రీలో అవకాశాలను అందుకొని ఎక్కువ రోజులపాటు కొనసాగగలము.అయితే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలంటే ముందుగా అవకాశాలను అందిపుచ్చుకోవాలని.

ఇలా అవకాశాల కోసం ఆడిషన్స్ కోసం ఇండస్ట్రీస్ చుట్టూ తిరిగి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న వారు ఎంతో మంది ఉన్నారు.ఇలా కెరియర్ మొదట్లో ఎన్నో అవమానాలను ఎదుర్కొని ప్రస్తుతం ఎవరూ ఊహించని స్థాయిలో ఉన్న సెలబ్రిటీలు ఉన్నారు.

 Sunny Kaushal Recalls Being Rejected For Shampoo Ad-ఆ హీరో షాంపూ యాడ్‌కు కూడా పనికిరాడన్నారు.. ఇప్పుడు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇలాంటి వారిలో బాలీవుడ్ హీరో సన్నీ కౌశల్ ఒకరు.

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సన్నీ కౌశల్ ప్రస్తుతం రాధిక మదన్ జంటగా “శిద్దత్” సినిమాలో నటించారు.

ఈ సినిమా ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది.ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా పాల్గొన్న హీరో సన్నీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మొదట్లో తన ఫస్ట్ ఆడిషన్ గురించి గుర్తు చేసుకున్నారు.

ఈ క్రమంలోనే ఇండస్ట్రీలోకి రావాలన్నా కోరికతో మొట్టమొదటిసారిగా ఒక షాంపూ ఆడిషన్ కి వెళ్లగా తనకు అక్కడ ఘోర అవమానం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు.

Telugu Bollywood, Rejected, Shampoo Ad, Sunny Kaushal-Movie

ఒక షాంపూ ఆడిషన్ కోసం వెళ్లిన తనకు యాడ్ చేయడం చేతకాదు అంటూ తనని బయటకు పంపించినప్పుడు ఎంతో అవమానంతో బాధపడ్డాననీ.ఈ యాడ్ లో భాగంగా బ్యాగ్ లో నుంచి షాంపూ బాటిల్ తీసి కెమెరాకు చూపించాలి.కనీసం అది కూడా చేయలేకపోయానని తనపై తనకే అసహ్యం వేసిందని ఈ ఇంటర్వ్యూ సందర్భంగా హీరో సన్నీ తెలియజేశారు.

అయితే ఆ అవమానంతో అలాగే కృంగిపోకుండా మంచో, చెడో ధైర్యం చేసి ముందడుగు వేశానని.ఆ ఘటనే ఇప్పుడు నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిందని బాలీవుడ్ హీరో తెలియజేశారు.

ఫ్యూచర్ లో ఎప్పుడైనా నేను షాంపూ యాడ్ చేసిన రోజే యాక్టర్ ననీ ఎంతో గర్వంగా చెప్పుకుంటానని తెలియజేశారు.

#Sunny Kaushal #Shampoo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు