సన్నీ పెళ్లి చేసుకునేది ఆ అమ్మాయినే.. సన్నీ గుట్టంతా బయటపెట్టిన ఫ్రెండ్ నరేష్!

Sunny Is Getting Married To That Girl Revealed By His Friend Naresh

బుల్లితెర సీరియల్ హీరోగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న నటుడు సన్నీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన ఎన్నో బుల్లితెర సీరియల్స్ లో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుని ఆ పాపులారిటీ తో బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కార్యక్రమంలోకి ఎంట్రీ ఇచ్చారు.

 Sunny Is Getting Married To That Girl Revealed By His Friend Naresh-TeluguStop.com

బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతో చాకచక్యంగా టాస్క్ లను పూర్తి చేస్తూ టాప్ త్రీ కంటెస్టెంట్ గా సన్నీ నిలుస్తారని ప్రతి ఒక్కరు భావిస్తున్నారు.ఇలా బిగ్ బాస్ హౌస్ లో టాస్క్ ల సమయంలో సన్నీ ప్రతి ఒక్కరితో గొడవ పడుతూ పోరాడి టాస్క్ లలో విజయం సాధిస్తున్నారు.

ఇలా బిగ్ బాస్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సన్నీకి రోజురోజుకు అభిమానులు పెరిగిపోతున్నారు.ఈ క్రమంలోనే సన్నికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే తప్పకుండా ఇతను ఎవరినైనా ప్రేమించి ఉంటారని ఎంతోమంది అభిమానులు సందేహాలను వ్యక్తపరుస్తూ ఉంటారు.

 Sunny Is Getting Married To That Girl Revealed By His Friend Naresh-సన్నీ పెళ్లి చేసుకునేది ఆ అమ్మాయినే.. సన్నీ గుట్టంతా బయటపెట్టిన ఫ్రెండ్ నరేష్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కానీ సన్నీ అత్యంత సన్నిహితులలో ఒకరైన తన ఫ్రెండ్ నరేష్ సన్నీ గురించి అసలు విషయాలను బయటపెట్టారు.

ఇక సన్నీ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత తనకు ప్రత్యేకంగా కాస్ట్యూమ్ డిజైన్ చేసి మేమే పంపిస్తామని నరేష్ ఈ సందర్భంగా వెల్లడించారు.

అందుకే సన్నీ ఎక్కువగా పూల చొక్కాలో తలపై టోపీ పెట్టుకొని ఎంతో విచిత్రంగా కనిపిస్తూ ప్రేక్షకులను ఆకర్షిస్తున్నారు.ఇలా బయట ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి సన్నీ జీవితంలో ఇప్పటివరకు ఏ అమ్మాయి లేదని షాకింగ్ విషయాన్ని తన బెస్ట్ ఫ్రెండ్ నరేష్ బయటపెట్టారు.

ఈ విషయం బయట చెప్పినా ఎవరూ నమ్మరని నిజానికి సన్నీ లైఫ్ లో ఇప్పటివరకు ఎవరూ లేరని తెలిపారు.

ఇకపోతే సన్ని తన జీవితంలో కూడా తన తల్లి కళావతి గారు చెప్పిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటారని,అలా తన తల్లి చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని తన తల్లికి మాట కూడా ఇచ్చారని సన్నీ స్నేహితుడు తెలిపాడు.తన తల్లికి ఏ అమ్మాయి నచ్చితే తన తల్లి ఏ అమ్మాయిని చూపిస్తే తనని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని సన్నీ పెళ్లి విషయం గురించి తెలిపారు.ఇక బిగ్ బాస్ విషయానికి వస్తే టాస్క్ లలో ఎంతో అద్భుతంగా ఆడుతూ రోజురోజుకు ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటున్న సన్నీ తప్పకుండా టాప్ 3 కంటెస్టెంట్ గా ఉంటారని కొందరు భావించగా మరికొందరు మాత్రం సన్నీనే గెలుస్తారని భావిస్తున్నారు.

ఇక గత వారంలో బిగ్ బాస్ హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్ లకు సంబంధించి ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ ని బిగ్ బాస్ వేదికపైకి తీసుకువచ్చి వారికి సర్ప్రైస్ ఇచ్చారు.ఇలా బిగ్ బాస్ వేదిక పైకి వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా దాదాపు సన్నీనీ టాప్ త్రీ టాప్ వన్ స్థానంలో పెట్టడం చూస్తుంటే తప్పకుండా ఈ సీజన్లో సన్నీ గెలిచే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

మరి ఈ సీజన్ లో ఎవరు గెలుస్తారు అనే విషయం తెలియాలంటే మరి రెండు వారాలు వేచి ఉండాలి.

#Friend #Marrige #Bigg Boss #Revealed #Sunny

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube