సిరిని గెలిపించి షన్ను ఔట్.. సన్నీ విన్.. మొదటి స్థానంలో అతను?

Sunny In Shanmukh Jaswanth Out Bigg Boss 5 Telugu Ticket To Finale Task

బిగ్ బాస్ హౌస్ లో టికెట్ టు ఫినాలే ఆట రసవత్తరంగా సాగింది.ఇందులో మానస్ తొలి స్థానంలో నిలిచాడు.

 Sunny In Shanmukh Jaswanth Out Bigg Boss 5 Telugu Ticket To Finale Task-TeluguStop.com

సన్నీ చివరి స్థానంలో నిలిచారు.మూడో దశలో ఏడుగురు కంటెస్టెంట్ లు పోటీపడగా శ్రీరామ్, సిరిలు గాయాలు పాలవడంతో వారిద్దరి తరుపున ఇద్దరూ గేమ్ ఆడే అవకాశం ఇచ్చాడు బిగ్ బాస్.

శ్రీరామ్ తరఫున ఆడటానికి సన్నీ ముందుకు రాగా, సిరి తరపున ఆడటానికి షణ్ముఖ్ వచ్చాడు.అయితే అప్పటి వరకూ కాళ్ళు నొప్పి అంటూ పర్ఫామెన్స్ చేసిన సిరి టాస్క్ అనే సరికి నేను ఆడతా అంటూ ముందుకు వచ్చింది.

 Sunny In Shanmukh Jaswanth Out Bigg Boss 5 Telugu Ticket To Finale Task-సిరిని గెలిపించి షన్ను ఔట్.. సన్నీ విన్.. మొదటి స్థానంలో అతను-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎంతమంది చెప్పినా వినకుండా తన గేమ్ తానే ఆడతాను అని తెలిపింది.కానీ బిగ్ బాస్ మాత్రం అందుకు ఒప్పుకోలేదు.

సిరి తరఫున షణ్ముఖ్ బరిలోకి దిగాడు.ఈ క్రమంలోనే వాటర్ పోసి బాల్స్ ని టబ్బులో పడేసే టాస్క్ ను ఇచ్చారు బిగ్ బాస్.

ఇందులో సన్నీ విన్నర్ అయ్యాడు.ఆ తర్వాత కాజల్, ప్రియాంక లు పోటీ పడగా షణ్ముఖ్, సన్నీ, మానస్ లు పోటీ పడ్డారు.

ఈ టాస్క్ లో మానస్ తక్కువ సమయంలో వాటర్ పోసి బాల్స్ టబ్బులో పడేటట్లు చేయడంతో విజేత అయ్యాడు.

Telugu Bigg Boss, Final, Kajal, Manas, Priyanka Singh, Siri, Sunny-Movie

షణ్ముఖ్ అందరికంటే తక్కువ బాల్స్ వేసి ఏడో స్థానానికి పరిమితమయ్యాడు.టికెట్ టు ఫినాలే లో చివరి మూడు స్థానాలలో నిలిచిన కంటెస్టెంట్ లు నెక్స్ట్ లెవెల్ వెళ్లే అర్హతను కోల్పోతారని బిగ్ బాస్ చెప్పారు.కాజల్, ప్రియాంక లు టికెట్ టు ఫినాలే నుంచి తప్పుకున్నారు.

సన్నీ, షణ్ముఖ్ ఇద్దరికీ సమానంగా పాయింట్లు దక్కడంతో మరొకసారి వీరు గేమ్ ఆడారు.

Telugu Bigg Boss, Final, Kajal, Manas, Priyanka Singh, Siri, Sunny-Movie

ఇందులో షన్ను అవుట్ కావడంతో సన్నీ గెలిచాడు.టికెట్ టు ఫినాలేకి సన్నీ, మానస్, సిరి, శ్రీరామ్ లు పోటీ పడనున్నారు.అందరికంటే ఎక్కువ పాయింట్లతో మానస్ ముందు ఉన్నాడు.

మరి ఫినాలేలో మొదటగా ఎవరు అడుగు పెడతారో తెలియాల్సి ఉంది.

#Bigg Boss #Siri #Kajal #Manas #Priyanka Singh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube