కరోనా ఎఫెక్ట్ తో దేశం మొత్తం మీద లాక్ డౌన్ లోకి వెళ్లిపోయింది.అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న లక్షల సంఖ్యలో ప్రజలు కరోనా బారిన పడ్డారు.
ఇక సినీ, రాజకీయ ప్రముఖులు కూడా కరోనా బారిన పడ్డారు.ఇలా కరోనా బారిన పడి చాలా మంది మృతి చెందారు.
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం లాంటి ప్రసిద్ధ గాయకుడు కూడా ఈ మృతి చెందారు.అలాగే చాలా మంది రాజకీయ ప్రముఖులు కూడా కరోనా బారిన పడి మృతి చెందారు.
అలాగే అమితాబచ్చన్ లాంటి స్టార్ హీరో కూడా కరోనా బారిన పడ్డారు.కొంత మంది సెలబ్రెటీలు కరోనా బారిన పడి బయట పడ్డారు.
అయితే ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టింది.ఆ భయం నుంచి జనం అందరూ బయటపడి ఎవరి జీవితాలలో వారు ముందుకి వెళ్తున్నారు.
కరోనా కేసులు నమోదు అవుతున్న కూడా భయపడే పరిస్థితి లేదు.
తాజాగా బాలీవుడ్ ప్రముఖ నటుడు, గురుదాస్‌పూర్ బీజేపీ ఎంపీ సన్నీడియోల్ కరోనా బారినపడ్డాడు.
ప్రస్తుతం ఆయన హిమాచల్‌ప్రదేశ్‌లోని కులూ జిల్లాలో ఉంటున్నారు.ఇటీవల భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న 64 ఏళ్ల సన్నీడియోల్ మనాలీ సమీపంలోని ఫాంహౌస్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు.
తాజాగా, సన్నీడియోల్, ఆయన స్నేహితులు ముంబై వెళ్లేందుకు సిద్ధమై కరోనా పరీక్షలు చేయించుకున్నారు.నిన్న ఫలితాలు రాగా సన్నీకి కరోనా సోకినట్టు నిర్ధారణ అయిందని హిమాచల్‌ప్రదేశ్ ఆరోగ్య కార్యదర్శి అమితాబ్ అవస్థి తెలిపారు.దీంతో ఆయన తిరిగి ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారు.వైద్యుల సలహా మేరకు జాగ్రత్తలు పాటిస్తూ చికిత్స తీసుకుంటున్నారు.