తెలుగులో ప్రస్తుతం మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతోంది.వచ్చి రావడంతోనే తన మొదటి చిత్రం అ .
ఆ. తో ప్రేక్షకులని బాగానే అలరించిన ఈ అమ్మడికి తన నటనా ప్రతిభను నిరూపించుకునే సరైన అవకాశం రాలేదనే చెప్పాలి. అందువల్లనే అనుపమ పరమేశ్వరన్ ఇప్పటి వరకు సినిమా పరిశ్రమలో తనకంటూ చెప్పుకోవటానికి సరైన హిట్ లేక గుర్తింపుకి నోచుకో లేకపోయింది.అయితే తాజాగా అనుపమ పరమేశ్వరన్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయితే ఇంతకీ ఆ వార్త ఏమిటంటే ఇటీవలే అనుపమ పరమేశ్వరన్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తాను రాజ్ కోట్ వెళుతున్నట్లు తెలిపింది. అంతేగాక విమానంలో ప్రయాణం చేస్తున్న సమయంలో తీసుకున్న ఫోటోలను కూడా షేర్ చేసింది.
దీంతో కొందరు నెటిజన్లు ప్రస్తుతం అనుపమ పరమేశ్వరన్ భారత ప్రముఖ ఫాస్ట్ బౌలర్ జస్ప్రిత్ బూమ్రా ని పెళ్లి చేసుకోబోతున్నట్లు తెగ చర్చించుకుంటున్నారు.దీనికితోడు బూమ్రా కూడా ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సీరీస్ నుంచి బ్రేక్ తీసుకుని గుజరాత్ కి వెళ్ళాడు.
దీంతో వీరిద్దరూ తొందర్లోనే పెళ్లి చేసుకోబోతున్నారని అందువల్లే బూమ్రా సెలవు తీసుకుని పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నట్లు కొందరు ప్రచారాలు చేస్తున్నారు.దీంతో ఇటీవలే అనుపమ పరమేశ్వరన్ తల్లి సునీత పరమేశ్వరన్ ఈ విషయంపై స్పందిస్తూ తన కూతురు క్రికెటర్ బుమ్రా ని పెళ్లి చేసుకోవడం లేదని, అంతేగాక చిన్నప్పటి నుంచి జస్ప్రీత్ బుమ్రా మరియు అనుపమ పరమేశ్వరన్ మంచి స్నేహితులని స్పష్టం చేసింది.
దీంతో అనుపమ పెళ్లి వ్రతలకి కొంతమేర బ్రేక్ పడింది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం అనుపమ పరమేశ్వరన్ తెలుగులో టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత మేనల్లుడు హీరోగా నటిస్తున్న చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.అలాగే ఇటీవలే మిడ్ నైట్ ఫ్రీడమ్ అనే లఘు చిత్రం లో మెయిన్ లీడ్ పాత్రలో నటించింది ఈ లఘు చిత్రాన్ని యూట్యూబ్లో విడుదల చేయగా మంచి స్పందన లభించింది.అయితే ఇటీవలే నిఖిల్ హీరోగా నటిస్తున్న 18పేజెస్ అనే చిత్రంలో కూడా హీరోయిన్ గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
కాగా ఈ చిత్రాన్ని టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవైండ్ నిర్మితున్నాడు.