సునీత మా ఫ్యామిలీకి పెద్ద కొడుకు.. సునీత తండ్రి ఎమోషనల్ కామెంట్స్ వైరల్!

స్టార్ సింగర్ సునీత గతేడాది ఇదే సమయంలో ప్రముఖ వ్యాపారవేత్త రామ్ వీరపనేనిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.పెళ్లి తర్వాత సునీత రామ్ అన్యోన్యంగా జీవనం సాగిస్తున్నారు.

 Sunitha Father Emotional Comments Goes Viral In Social Media Details, Singer Sun-TeluguStop.com

సునీత గతంతో పోలిస్తే సోషల్ మీడియాలో యాక్టివ్ కావడంతో పాటు భర్తతో కలిసి దిగిన ఫోటోలను, భర్తకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.తొలి వివాహ వార్షికోత్సవం సందర్భంగా సునీత ప్రతి పెళ్లి వెనుక ఒక కథ ఉంటుందని ఆ కథ లైఫ్ లాంగ్ మధుర జ్ఞాపకంగా నిలుస్తుందని చెప్పుకొచ్చారు.

పెళ్లి వేడుక జ్ఞాపకాలు పేరుతో సునీత వీడియోను ఫ్యాన్స్ తో పంచుకున్నారు.యూట్యూబ్ లో ఈ వీడియో వైరల్ అవుతుండగా సునీత గురించి, సునీత పెళ్లి గురించి ఈ వీడియోలో ఆమె తల్లిదండ్రులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

సహనం, చిరునవ్వుతో తన కూతురు ముందడుగు వేసిందని సునీత తల్లి అన్నారు.డైనమిక్, డేరింగ్ పర్సనాలిటీ సునీత అంటూ ఆమె తల్లి చెప్పుకొచ్చారు.

సునీత రామ్ వీరపనేని గురించి వీడియోలో చెబుతూ ఎనిమిది సంవత్సరాలుగా రామ్ తో తనకు పరిచయం ఉందని రామ్ మంచి కాఫీలాంటి అబ్బాయని అన్నారు.

Telugu Ram Veerapaneni, Sunitha-Movie

తన భర్త చాలా నిజాయితీ ఉన్న వ్యక్తి కావడంతో పాటు ఏ విషయాన్నైనా తన భర్త ముఖం మీదే చెబుతారని సునీత కామెంట్లు చేశారు.సునీత తండ్రి మాట్లాడుతూ తమ ఫ్యామిలీకి సునీత పెద్ద కొడుకు అని అన్నారు.లైఫ్ లో సునీత ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొందని సునీత తండ్రి చెప్పుకొచ్చారు.

Telugu Ram Veerapaneni, Sunitha-Movie

వివాదాలకు దూరంగా ఉండే సునీత ఇండస్ట్రీలోకి ఎంతోమంది సింగర్స్ ఎంట్రీ ఇస్తున్నా అవకాశాలను మాత్రం అందిపుచ్చుకుంటున్నారు .సునీత పలు రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరించి జడ్జిగా కూడా మంచి పేరును సంపాదించుకున్నారు.సునీతకు ప్రేక్షకుల్లో భారీస్థాయిలో క్రేజ్ ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube