ప్లాప్ అయిన సినిమాలకు సక్సెస్ మీట్ ఏంటో.. శాక్రిఫైజ్ స్టార్ సునిశిత్ కామెంట్స్ వైరల్!

శాక్రిఫైజ్ స్టార్ సునిశిత్ గురించి మనందరికీ తెలిసిందే.అతను ఒక సెలబ్రిటీ అని చెప్పుకుంటూ, స్టార్ అన్నట్లుగా ఫీల్ అయి పోతూ ఉంటాడు అంతేకాకుండా గతంలో కూడా పలువురు టాలీవుడ్ స్టార్స్ పై సునిశిత్ వాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

 Sunishith Comments On Nagarjuna Bangarraju Movie Details, Sunishith , Bangarraj-TeluguStop.com

ఆ వాఖ్యలు కాస్త తీవ్ర దుమారం లేపాయి.ఆ సినిమాలో నటించే అవకాశం మొదట నాకే వచ్చింది కానీ ఆ హీరో అడగగానే హీరోకి ఇచ్చేశాను.

హీరోయిన్ నన్ను పెళ్లాడింది.మరొక హీరోయిన్ తో డేటింగ్ కూడా చేశా అంటూ ఇలా పిచ్చి పిచ్చి మాటలతో రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోయాడు సునిశిత్.

దీంతో అతనికి శాక్రిఫైజ్ స్టార్ సునిశిత్ పేరు వచ్చింది.కొంతమంది హీరోయిన్ లు అతని పిచ్చివాగుడుకీ విసుగుచెంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతను పత్తా లేకుండా పోయాడు.

ఆ తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతూ వస్తున్నాడు.ఇక తాజాగా మరొకసారి సినిమాల పై కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచాడు.అక్కినేని నాగార్జున నటించిన బంగార్రాజు సినిమా సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.ఈ విషయంపై అతడు స్పందిస్తూ ఎత్తి పోయిన సినిమాలకు సక్సెస్ మీట్ పెట్టడం ఒక ఫ్యాషన్ అయిపోయింది.

ఇదే కథను నాకు రెండేళ్ల క్రితం చెప్పారు.నాకు నచ్చలేదు.

ఈ సినిమా ఎవరితో తీసిన పోతుంది అని అప్పుడే చెప్పాను.ఇప్పుడు అదే జరిగింది అంటూ బంగార్రాజు సక్సెస్ మీట్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు శాక్రిఫైజ్ స్టార్ సునిశిత్.

Telugu Bangarraju, Bangarraju Meet, Naga Chaitanya, Nagarjuna, Sunishit, Sunishi

ఇక అందుకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేయడంతో.అక్కినేని అభిమానులు, నెటిజెన్స్ అతన్ని ఒక రేంజ్ లో ఆడుకుంటున్నారు.అతని పై కామెంట్స్ చేస్తూ ఏకీ పారేస్తున్నారు.ఇకపోతే బంగార్రాజు సినిమా విషయానికి వస్తే.ఈ సినిమా జనవరి 14న సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన విషయం తెలిసిందే.ఈ సినిమా విడుదల అయి మంచి విజయం సాధించింది.

అంతేకాకుండా సంక్రాంతి బరిలో మరో సినిమా లేకపోవడంతో విజయ ఢంకా మొగిస్తూ కలెక్షన్ లతో దూసుకుపోతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube