సునీల్‌ ఇంకొన్నాళ్లు చూసి ఆ పని మొదలు పెట్టనున్నాడా?  

Sunil Want To Directs Sai Dharam Tej-sai Dharam Tej,sunil Direction

  • సునీల్‌ కెరీర్‌ ప్రస్తుతం ప్రమాదంలో ఉంది. కమెడియన్‌గా మంచి క్రేజ్‌ ఉన్న సమయంలో హీరో వేషాల కోసం వెళ్లిన సునీల్‌, హీరోగా కొన్నాళ్లు మాత్రమే మెప్పించి మళ్లీ కామెడీ పాత్రలు చేసేందుకు బ్యాక్‌ వచ్చేశాడు. ఇప్పుడు కామెడీ పాత్రలు చేసేందుకు జబర్దస్త్‌ దయ వల్ల ఎంతో మంది కమెడియన్స్‌ వస్తున్నారు. సోషల్‌ మీడియా ద్వారా కూడా కమెడియన్స్‌ పుట్టుకు వస్తున్నారు. ఇలాంటి సమయంలో సునీల్‌ కమెడియన్‌గా మళ్లీ రాణించడం కష్టమే అనిపిస్తుంది.

  • ఇప్పటికే కమెడియన్‌గా రిటర్న్‌ తీసుకున్న తర్వాత సునీల్‌ మూడు నాలుగు పెద్ద సినిమాల్లో నటించాడు. కాని అందులో ఏ ఒక్కటి కూడా ఆయనకు సక్సెస్‌ను తెచ్చి పెట్టలేదు. మంచి పాత్రలు దక్కితే కాని సునీల్‌ మళ్లీ మునుపటి క్రేజ్‌ను దక్కించుకునే ఛాన్స్‌ లేదు. ఇలాంటి సమయంలో సునీల్‌ చేసిన మూవీ ‘చిత్రలహరి’. మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ నటించిన చిత్రలహరి మూవీ విడుదలకు సిద్దం అవుతుంది. తాజాగా టీజర్‌ను విడుదల చేశారు.

  • టీజర్‌లో చూస్తుంటే సునీల్‌కు ఈ చిత్రంలో చాలా ప్రాముఖ్యత ఉన్న పాత్ర దక్కినట్లుగా అనిపిస్తుంది. ఒక వేళ ఈ చిత్రంతో సునీల్‌ మునుపటి జోరును దక్కించుకుంటే మాత్రం సునీల్‌ మళ్లీ కమెడియన్‌గా స్టార్‌ అవ్వొచ్చు. ఒక వేళ కమెడియన్‌గా రాణించకుంటే మాత్రం దర్శకుడిగా మారిపోయేలా ఉన్నాడు. తాజాగా చిత్రలహరి టీజర్‌ లాంచ్‌ కార్యక్రమంలో సాయి ధరమ్‌ తేజ్‌ ఒప్పుకుంటే తప్పకుండా దర్శకత్వం చేస్తానంటూ సునీల్‌ అంటున్నాడు. కమెడియన్స్‌ దర్శకులుగా మారి సక్సెస్‌ దక్కించుకున్న దాఖలాలు అయితే లేవు. మరి సునీల్‌ ఆ సెంటిమెంట్‌ను బ్రేక్‌ చేస్తాడేమో చూడాలి.