మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అగ్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో RC15 సినిమా ఈ మధ్యనే గ్రాండ్ గా లాంచ్ చేసిన విషయం తెలిసిందే.ఈ వేడుకను హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా నిర్వహించారు.
మెగాస్టార్ చిరంజీవి తో పాటు లెజెండ్రీ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి, బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ కూడా ఈ పూజా కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విచ్చేసారు.
ఇక ఈ సినిమా అతి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోబోతుంది.
ఈ సినిమా లాంచ్ రోజు విడుదల చేసిన పోస్టర్ లో ఈ సినిమాలో నటించే నటీనటుల ఎవరనేది స్పష్టంగా ఉంది.ఈ పోస్టర్ ను శంకర్ భారీ ఖర్చుతో చాలా క్రియేటివ్ గా చేయించాడు.
అందరు సూటు బూటు వేసుకుని చేతిలో ఫైల్స్ పట్టుకుని స్టైలిష్ లుక్ లో కనిపించరు ఈ పోస్టర్ లో సునీల్ కూడా ఉన్నాడు.
దీంతో ఈయనకు మంచి అవకాశం దొరికిందని అందరు అనుకున్నారు.అయితే సునీల్ పాత్రపై తాజాగా ఒక రూమర్ బయటకు వచ్చింది.ఈ సినిమాలో సునీల్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడని టాక్ వినిపిస్తుంది.
ఈ సినిమాలో ఈ పాత్ర చాలా కీలకంగా ఉంటుందట.మళ్ళీ ఈ క్యాటెక్టర్ తో సునీల్ కెరీర్ గదిలో పడినట్టే అని అందరు అనుకుంటున్నారు.
ఈ సినిమాలో సునీల్ ను ఒక డిఫెరెంట్ యాంగిల్ లో చూపించ బోతున్నాడని చెప్పుకుంటున్నారు.మొత్తానికి సునీల్ పాన్ ఇండియా సినిమాలో ఒక మంచి అవకాశాన్ని అందుకున్నాడు.ఇక ఈ సినిమాను పొలిటికల్ త్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నాడు.థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా.శ్రీ వెంకటేశ్వర బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాను నిమిస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమాకు విశ్వంభర అబే క్రేజీ టైటిల్ కూడా వినిపిస్తుంది.