అనిల్ సుంకర చేతికి మండేలా రీమేక్ రైట్స్... ఫ్రేమ్ లోకి సునీల్

తమిళంలో యోగిబాబు లీడ్ రోల్ లో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన పొలిటికల్ సెటైరికల్ మూవీ మండేలా మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది.అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఓ వైపు వినోదాన్ని అందిస్తూనే అందరిని ఆలోచింపజేసేలా ఉందని అభిప్రాయం వ్యక్తం అయ్యింది.

 Sunil To Star In Mandela Telugu Remake-TeluguStop.com

ఇదిలా ఉంటే ఈ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ కోసం బండ్ల గణేష్ ప్రయత్నం చేస్తాడు.తానే లీడ్ రోల్ లో ఈ సినిమాని రీమేక్ చేయాలని భావించాడు.

అయితే అనూహ్యంగా ఈ మూవీ రీమేక్ రైట్స్ అనిల్ సుంకర చేతికి వెళ్ళిపోయాయి.తాజాగా రీమేక్ రైట్స్ ని అయన భారీ రేటు చెల్లించి సొంతం చేసుకున్నారు.

 Sunil To Star In Mandela Telugu Remake-అనిల్ సుంకర చేతికి మండేలా రీమేక్ రైట్స్… ఫ్రేమ్ లోకి సునీల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదిలా ఉంటే ఈ సినిమాలో లీడ్ రోల్ కోసం సునీల్ ని తీసుకోవడానికి అనిల్ సుంకర ప్రయత్నం చేస్తున్నాడు.

హీరో నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టర్న్ తీసుకొని సునీల్ వరుస సినిమాలు చేస్తున్నాడు.

అయితే ఊహించని విధంగా మళ్ళీ హీరోగా మూడు సినిమాలని ఇప్పటికే లైన్ లో పెట్టాడు.అందులో వేదాంతం రాఘవయ్య, మర్యాద క్రిష్నయ్య సినిమాలతో పాటు బెల్ బాటమ్ రీమేక్ కూడా ఉందని తెలుస్తుంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు అనిల్ సుంకర కూడా మండేలా రీమేక్ కోసం సునీల్ ని తీసుకోవడానికి ఫిక్స్ అయ్యి ఇప్పటికే అతన్ని సంప్రదించినట్లు తెలుస్తుంది.సునీల్ కూడా ఈ రీమేక్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే అని ఫిలిం నగర్ సర్కిల్ లో వినిపిస్తుంది.

మొత్తానికి లీడ్ కమెడియన్ గా రీ ఎంట్రీ ఇవ్వాలని అనుకున్న బండ్ల గణేష్ కలకి సునీల్ రూపంలో గండి పడిందని దీనిని బట్టి తెలుస్తుంది.

#Yogi Babu #MandelaTelugu #Actors Sunil #Anil Sunkara

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు