వరుణ్ తేజ్ సినిమాను ఆ సెంటిమెంట్ భయపెడుతోందా..?

ఎఫ్ 2, గద్దలకొండ గణేష్ విజయాల తర్వాత వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న గని సినిమా ఈ ఏడాది సెకండాఫ్ లో విడుదల కానుంది.వరుస విజయాల తర్వాత వరుణ్ తేజ్ నటిస్తున్న సినిమా కావడంతో గని సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి.

 Sunil Shetty Sentiment Troubling The Varun Tej Ghani Movie ,ghani Movie, Sunil S-TeluguStop.com

వరుణ్ తేజ్ కెరీర్ లో గని సినిమా మరో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.అయితే ఒక సెంటిమెంట్ మాత్రం వరుణ్ ఫ్యాన్స్ ను చాలా భయపెడుతోంది.

మూడు రోజుల క్రితం మంచు విష్ణు హీరోగా కాజల్ విష్ణుకు అక్కగా నటించిన మోసగాళ్లు సినిమా విడుదలైన సంగతి తెలిసిందే.ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిక్స్ డ్ టాక్ రాగా కలెక్షన్లపరంగా మోసగాళ్లు ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరుస్తోంది.

ఈ సినిమాలో కీలక పాత్రలో సునీల్ శెట్టి నటించిన సంగతి తెలిసిందే.బాలీవుడ్ లో సునీల్ శెట్టి నటించిన ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లయ్యాయి.

Telugu Disaster, Ghani, Kajal, Manchu Vishnu, Mosagallu, Sunil Shetty, Sunilshet

కానీ దక్షిణాది భాషల్లో సునీల్ శెట్టి నటించిన సినిమాలు మాత్రం సక్సెస్ కావడం లేదు.శాండిల్ వుడ్ లో సుదీప్ హీరోగా తెరకెక్కిన ఒక సినిమాలో, సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తమిళంలో తెరకెక్కిన దర్బార్ సినిమాలో సునీల్ శెట్టి కీలక పాత్రలో నటించారు.కానీ ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్లుగా మిగిలాయి.ఈ సినిమాలతో పాటు మోసగాళ్లు సినిమా కూడా ఫ్లాప్ కావడంతో సునీల్ శెట్టి నటిస్తే ఫ్లాప్ అని ప్రేక్షకులు భావిస్తున్నారు.

వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న గని సినిమాలో సునీల్ శెట్టి కీలక పాత్రలో నటిస్తున్నారు.ఈ సినిమా కూడా సక్సెస్ కాకపోతే సునీల్ శెట్టి నటిస్తే సినిమా ఫ్లాప్ అనే సెంటిమెంట్ బలపడే అవకాశం ఉంది.

సునీల్ శెట్టి గని సినిమాతో తనపై ఉన్న నెగిటివ్ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తారేమో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube