విజయ్ దేవరకొండ పాన్ ఇండియా మూవీ లో విలన్ గా సునీల్ శెట్టి  

Sunil Shetty negative role for Vijay devarakonda fighter movie, Tollywood, Bollywood, Puri Jagannath, Karan Johar, Pan India movie - Telugu Bollywood, Karan Johar, Pan India Movie, Puri Jagannath, Sunil Shetty Negative Role For Vijay Devarakonda Fighter Movie, Tollywood

సౌత్ ఇండియన్ క్రేజీ హీరో, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరిజగన్నాథ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే.ఈ సినిమా మొదటి షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని రెండో షెడ్యూల్ కి రెడీ అవుతున్న సమయంలో లాక్ డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది.

 Sunil Shetty Negative Role For Vijay Devarakonda Fighter Movie

అయితే మరల షరతులతో షూటింగ్ లకి అనుమతి లభించడంతో త్వరలో సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతున్నారు.ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఇప్పటివరకు ఏ సినిమాలో కనిపించిన విధంగా సరికొత్త గెటప్ లో కనిపించబోతున్నారు.

పూరి జగన్నాథ్ మార్క్ ఈ సినిమాలో కూడా ఉండబోతుంది.ఇక పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాను చార్మి, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

విజయ్ దేవరకొండ పాన్ ఇండియా మూవీ లో విలన్ గా సునీల్ శెట్టి-Movie-Telugu Tollywood Photo Image

ఇదిలా ఉంటే సినిమాని ఆగస్ట్ లో సెట్స్ పైకి తీసుకెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.

బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కబోయే ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరో సునీల్ శెట్టిని ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది.

సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టర్న్ తీసుకున్న సునీల్ శెట్టి వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు.ఇక పూరి జగన్నాథ్ ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో బాలీవుడ్లో మార్కెట్ కోసం సునీల్ శెట్టి ఇందులో విలన్ పాత్ర కోసం సంప్రదించడం జరిగిందని, కరణ్ జోహార్ కూడా సూచించడంతో అతన్ని ఫైనల్ చేయడం జరిగిందని తెలుస్తుంది.

త్వరలో దీనికి సంబంధించిన అఫిషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.ఇస్మార్ట్ శంకర్ తో మళ్ళీ జోష్ లోకి వచ్చిన పూరి జగన్నాథ్ ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

మరి పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాతో పూరి, విజయ్ దేవరకొండ ఎంతవరకు ఇండియా వైడ్ గా ట్రెండ్ సృష్టిస్తారు అనేది వేచి చూడాలి.

#Pan India Movie #Puri Jagannath #Karan Johar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sunil Shetty Negative Role For Vijay Devarakonda Fighter Movie Related Telugu News,Photos/Pics,Images..