పూరి ఫైటర్ టీంలో జాయిన్ అయిన సునీల్ శెట్టి

కమర్షియల్ దర్శకుడు పూరి జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఫైటర్ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ సగం ఇప్పటికే కంప్లీట్ అయ్యింది.

 Sunil Shetty Joins Puri Jagannadh Fighter Movie, Tollywood, Bollywood, Telugu Ci-TeluguStop.com

లాక్ డౌన్ ఎఫెక్ట్ తో వాయిదా పడ్డ సినిమా మరల రీ షెడ్యూల్ చేస్తున్నారు.త్వరలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.

ఇందులో విజయ్ దేవరకొండకి జోడీగా బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే నటిస్తుంది.ఇదిలా ఉంటే పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాని పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ నేపధ్యంలో బాలీవుడ్ ఆడియన్స్ కి కూడా కనెక్ట్ అయ్యే విధంగా యూనివర్శల్ కాన్సెప్ట్ తీసుకోవడంతో పాటు దానికి తగ్గట్లే హంగులు కూడా సమకూర్చుతున్నారు.ఫైటర్ సినిమాలో కీలక పాత్రల కోసం బాలీవుడ్ నటులని ఎంపిక చేస్తున్నారు.

ఈ నేపధ్యంలో తాజాగా పూరి జగన్నాథ్ ఫైటర్ కోసం బాలీవుడ్ హీరో సునీల్ శెట్టిని రంగంలోకి దించుతున్నట్లు తెలుస్తుంది.
సినిమాలో ప్రధాన పాత్ర కోసం బాలీవుడ్‌ హీరో సునీల్‌ శెట్టిని దించనున్నాడు.

దీనికి సునీల్‌ ఇప్పటికే అంగీకారం కూడా తెలిపాడని సమాచారం.డాన్‌గా కనిపించే సునీల్‌ పాత్ర ఈ సినిమాకు కీలకంగా ఉంటుందని సమాచారం.

ఇదిలా ఉంటే బాక్సింగ్ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి పూరి తనకి అలవాటైన మాఫియా టచ్ ఇస్తున్నాడు.ఇస్మార్ట్ శంకర్ తో ఊపులోకి వచ్చిన పూరికి ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో కమర్షియల్ హిట్ ఇస్తుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఛార్మి, కరణ్ జోహార్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.బాలీవుడ్ ప్రేక్షకులని తన కథలతో ఇప్పటికే బుట్టలో వేసుకున్న పూరి ఈ సినిమాతో మరోసారి వేసుకోవడానికి రెడీ అవుతున్నాడు అనే టాక్ వినిపిస్తుంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube