డిటెక్టివ్ రామకృష్ణగా కనిపించబోతున్న సునీల్

కమెడియన్ నుంచి హీరోగా టర్న్ తీసుకొని అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయినా సునీల్ మళ్ళీ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయాడు.ఓ వైపు కమెడియన్ గా పాత్రలు చేస్తూ మరో వైపు విలన్ గా, పోలీస్ ఆఫీసర్ గా ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేయడానికి రెడీ అయిపోయాడు.

 Sunil Played Detective Ramakrishna Role In Kanabadutaledu Movie, Tollywood, Telu-TeluguStop.com

డిస్కో రాజా సినిమా క్లైమాక్స్ లో విలనీగా ట్విస్ట్ ఇచ్చిన సునీల్ కలర్ ఫోటో సినిమాలో పూర్తిస్థాయిలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మెప్పించాడు.ఈ సినిమాలో అతని పెర్ఫార్మెన్స్ కి మంచి ప్రశంసలు లభించాయి.

కేవలం సీరియస్ పెర్ఫార్మెన్స్ తోనే కలర్ ఫోటో సినిమాలో విలనిజాన్ని సునీల్ పండించాడు.ఇక పుష్ప సినిమాలో కూడా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలోనే సునీల్ కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.

ఇదిలా ఉంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా కథ ప్రాధాన్యత బట్టి సినిమాలో సునీల్ నటిస్తున్నాడు.

కలర్ ఫోటో తర్వాత తాజాగా కనబడుటలేదు అనే మరో సినిమా సినిమాలో సునీల్ నటించాడు.

ఈ సినిమాలో డిటెక్టివ్ రామకృష్ణ అనే పాత్రలో సునీల్ కనిపించబోతున్నాడు.సస్పెన్స్ థ్రిల్లర్ గా వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ ఇప్పటికే ప్రేక్షకుల ముందుకి వచ్చి ఆకట్టుకుంది.

ఇప్పుడు ఈ సినిమాలో సునీల్ పాత్రని రివీల్ చేయడం ద్వారా సినిమాపై కొంత హైప్ క్రియేట్ చేశారు.ఒక అమ్మాయి మిస్సింగ్ నేపధ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాతో బాలరాజు అనే యువ దర్శకుడు బిగ్ స్క్రీన్ పై తన దృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అయ్యాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube