తెలంగాణలో కాంగ్రెస్ విజయానికి సునీల్ కనుగోలు కారణమా.. ఈ వ్యూహకర్త వ్యూహాలు ఫలించాయిగా!

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్( Congress ) విజయం సాధించడంతో ఆ పార్టీ నేతల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.మొత్తం 119 స్థానాలలో 64 స్థానాలలో కాంగ్రెస్ విజయం సాధించింది.

 Sunil Kanugolu Inspirational Story Details Here Goes Viral In Social Media ,-TeluguStop.com

సీపీఐ గెలిచిన స్థానాన్ని కూడా కౌంట్ చేస్తే 65 స్థానాలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం గమనార్హం.తెలంగాణలో కాంగ్రెస్ విజయానికి సునీల్ కనుగోలు( Sunil Kanugolu ) కారణమని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

కర్ణాటకలో కాంగ్రెస్ ను గెలిపించిన సునీల్ కనుగోలు తెలంగాణలో పార్టీ అధికారంలోకి రావడానికి తెరవెనుక తీవ్రస్థాయిలో శ్రమించారని సమాచారం అందుతోంది.తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అందరి నోటా సునీల్ కనుగోలు పేరు వినిపిస్తోంది.

ఎత్తులకు పై ఎత్తులు వేసి కాంగ్రెస్ పార్టీని ప్రజలకు దగ్గర చేయడం కోసం సునీల్ పడిన కష్టం మామూలు కష్టం కాదని సమాచారం అందుతోంది.

Telugu Aidmk, Dk Shiva Kumar, Rahul Gandhi, Revanth Reddy, Sunil Kanugolu, Ts-La

దేశంలోని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్తలలో సునీల్ కనుగోలు ఒకరిగా ఉన్నారు.గతంలో ప్రశాంత్ కిషోర్ టీమ్ లో సునీల్ కనుగోలు పని చేశారు.నవ సంకల్ప్ డిక్లరేషన్ అమలు కోసం మొదట సునీల్ కనుగోలును సభ్యుడిగా నియమించింది.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ( Rahul Gandhi )కి ప్రధాన సలహాదారులలో సునీల్ ఒకరు కావడం గమనార్హం.సునీల్ కనుగోలు భారత్ జోడీ బాధ్యతలను తీసుకొని ఆ కార్యక్రమాన్ని పూర్తి చేశారు.

Telugu Aidmk, Dk Shiva Kumar, Rahul Gandhi, Revanth Reddy, Sunil Kanugolu, Ts-La

సునీల్ కనుగోలు గతంలో డీఎంకే, ఏఐడీఎంకే పార్టీలకు సైతం వ్యూహకర్తగా పని చేయడం గమనార్హం.కాంగ్రెస్ అధిష్టానం పూర్తిస్థాయిలో స్వేచ్ఛ ఇవ్వడం వల్లే సునీల్ కనుగోలు పార్టీని గెలిపించాడని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సునీల్ కనుగోలు భవిష్యత్తులో ఇతర రాష్ట్రాల్లో సైతం పార్టీని అధికారంలోకి తీసుకొనిరావడం గ్యారంటీ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.సునీల్ కనుగోలు వ్యూహకర్తగా తన స్థాయిని పెంచుకుంటున్నారు.

సునీల్ కనుగోలుకు ఇతర పార్టీల నుంచి సైతం ఊహించని స్థాయిలో ఆఫర్లు వస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube