కమెడియన్ గా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన సునీల్ ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.హీరోగా సినిమాలు సక్సెస్ అవ్వక పోవడంతో మళ్లీ కమెడియన్గా సునీల్ కెరీర్ టర్న్ తీసుకున్నాడు.
కమెడియన్గా గతంలో స్టార్డం హోదా అనుభవించిన సునీల్ ఇప్పుడు మాత్రం ఆశించిన స్థాయిలో ఆఫర్లు రావడం లేదు.దాంతో ఆయన కెరీర్ ప్రమాదంలో పడ్డట్లయ్యింది.
సునీల్ కమెడియన్ గా ఇక పనికి రాడేమో అంటూ చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తుండగా అనూహ్యంగా విలన్గా మనోడికి ఆఫర్లు వచ్చాయి.కలర్ ఫొటో మూవీలో చిన్న విలన్ పాత్రలో కనిపించిన ఈయన త్వరలో పుష్ప సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం పుష్ప సినిమాలో ఈయన చేస్తున్నది విలన్ పాత్ర అయ్యి ఉండవచ్చు అనే కోణంలో కూడా ప్రచారం జరుగుతోంది.ఇప్పటికే పుష్పలో చాలా మంది విలన్ ల పేర్లు వినిపిస్తున్నాయి.
సునీల్ కూడా అందులో ఒక విలన్ అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఈ సినిమా ఉంటుందని అందరు చాలా నమ్మకంగా ఉన్నారు.
సునీల్ ఈ సినిమాతో మంచి సక్సెస్ ను దక్కించుకుంటే తప్పకుండా ఆయన కెరీర్ మరో టర్న్ తిరుగుతుంది.మరో వైపు వీఎన్ ఆధిత్య దర్శకత్వంలో సునీల్ ఒక సినిమాను చేస్తున్నాడు.
అందులో హీరోగా సునీల్ కనిపించబోతున్నాడు.ఒక వైపు హీరోగా మరో వైపు విలన్ గా నటిస్తున్న సునీల్ కెరీర్ చాలా రసవత్తరంగా మారింది అనడంలో సందేహం లేదు.
అద్బుతమైన ఈ ప్రయాణంలో సునీల్ ఈ రెండు విజయాలను దక్కించుకుంటే ఆయన ముందుకు వెళ్తాడు.లేదంటే ఇక్కడితో ఆగిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది.
ఆయన ఆశలన్నీ ఈ రెండు సినిమాలపైనే ఉన్నాయి.ఈ రెండు సినిమాలు కూడా ఆయన హీరో లేదా విలన్ గా ముందు ముందు మనకు ఎంతగా చూపిస్తాయి అనేది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.