కలర్ ఫోటోపైనే ఆధారపడ్డ సునీల్

టాలీవుడ్‌లో కమెడియన్‌గా స్టార్ స్టేటస్ అందుకున్న సునీల్, ఆ తరువాత హీరోగా మారి విజయాలను కూడా అందుకున్నాడు.అయితే హీరోగా వచ్చిన సక్సెస్‌ను ఎక్కువకాలం నిలబెట్టుకోలేకపోయాడు.

 Sunil Huge Expectations On Color Photo, Sunil, Suhaas, Color Photo, Tollywood Ne-TeluguStop.com

దీంతో హీరోగా వరుస ఫెయిల్యూర్స్‌ను ఎదుర్కొని ఫేడవుట్ అయిపోయాడు.అయితే హీరోగా రాణించలేకపోతున్న సునీల్, మళ్లీ కమెడియన్‌గా మారాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు.

ఇప్పటికే పలు చిత్రాల్లో క్యారెక్టర్ పాత్రలు చేస్తున్న సునీల్, తనలో విలన్ కూడా ఉన్నాడని నిరూపించుకున్నాడు.

రవితేజ నటించిన డిస్కోరాజా చిత్రంలో అందరికీ షాకిస్తూ విలన్ పాత్రలో సునీల్ మెప్పించాడు.

ఇక ఈ సినిమాలో సునీల్ నటనకు ప్రేక్షకులు ఇంప్రెస్ కావడంతో, మరోసారి విలనిజం చూపించేందుకు సునీల్ రెడీ అవుతున్నాడు.ఈ క్రమంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుహాస్ హీరోగా మారి చేస్తున్న తాజా చిత్రం ‘కలర్ ఫోటో’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది.

పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో సునీల్ నెగెటివ్ పాత్రలో నటిస్తున్నాడు.ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్స్‌లో సునీల్ తనదైన డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

అయితే ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని సునీల్ చూస్తున్నాడు.ఈ సినిమాలో తన పాత్ర సినిమాకు మేజర్ అసెట్ కానుందని సునీల్ అంటున్నాడు.

ఒకవేళ ‘కలర్ ఫోటో’ చిత్రం ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయితే మాత్రం సునీల్‌కు వరుసగా నెగెటివ్ పాత్రల ఆఫర్లు రావడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.మొత్తానికి సునీల్ భవిష్యత్తు ‘కలర్ ఫోటో’పై ఆధారపడి ఉందనే మాట నిజం.

మరి కలర్ ఫోటోతో సునీల్ కల నెరవేరుతుందా లేదా అనేది తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.ఇక ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube