ఎఫ్3లో కీలక పాత్ర కోసం సునీల్ ని ఫైనల్ చేసిన అనిల్ రావిపూడి

టాలీవుడ్ లో కమర్షియల్ చిత్రాలతో వరుసగా హిట్స్ కొడుతూ స్టార్ దర్శకుడు రేంజ్ కి ఎదిగిన మరో రైటర్ అనిల్ రావిపూడి.పటాస్ తో స్టార్ట్ చేసిన అతని హిట్ జర్నీ సరిలేరు నీకెవ్వరు వరకు కొనసాగుతూనే వచ్చింది.

 Sunil Got A Opportunity In F3 Movie, Tollywood, Telugu Cinema, F2 Sequel, Anil R-TeluguStop.com

ప్రతి సినిమాకి కథల విషయంలో వేరియేషన్ చూపిస్తూనే కమర్షియల్ హీరోయిజం వదలకుండా, అలాగే తన మార్క్ కామెడీతో కడుపుబ్బా నవ్విస్తూ హిట్ మీద హిట్ కొడుతున్నాడు.ఇప్పట్లో అతని స్పీడ్ ని ఎవరూ కూడా ఆపేలా లేరు.

సరిలేరుతో సూపర్ హిట్ కొట్టిన అనిల్ ఇప్పుడు ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్3 కి సిద్ధం అవుతున్నాడు.ఈ సినిమా సీక్వెల్ కి సంబందించిన కథని ఇప్పటికే సిద్ధం చేసినట్లు తెలుస్తుంది.

ఇక ఎఫ్ 2లో ఉన్న రెండు జంటలతో పాటు ఇందులో మరో హీరో, హీరోయిన్ జంట కూడా కలవబోతున్నారు అని తెలుస్తుంది.దానికోసం రవితేజతో సంప్రదింపులు జరిపినట్లు ఆ మధ్య టాక్ వచ్చింది.

ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి తాజాగా మరో అప్డేట్ వినిపిస్తుంది.ఇందులో సునీల్ ని ఓ కీలక పాత్ర కోసం ఎంపిక చేసినట్లు సమాచారం.

హీరో నుంచి మళ్ళీ కమెడియన్ గా టర్న్ తీసుకున్న సునీల్ కి ఒకప్పటిలా సరైన పాత్రలు పడటం లేదు.తన స్నేహితుడు త్రివిక్రమ్ అవకాశాలు ఇస్తున్న తిరిగి తనని తాను ప్రూవ్ చేసుకునే రేంజ్ లో అవి ఉండటం లేదు.

ఇలాంటి టైంలో కామెడీకి పెద్ద పీట వేస్తూ ప్రత్యేక పాత్రలు సృష్టించి అనిల్ చేతిలో సునీల్ పడటం విశేషం.ఎఫ్ 2లో రాజేంద్ర ప్రసాద్ పోషించినటువంటి ఒక మంచి కామెడీ రోల్ ను సునీల్ తో చేయించాలని దర్శకుడు అనీల్ రావిపూడి భావిస్తున్నాడని తెలుస్తుంది.

ఆ పాత్ర కమెడియన్ కు ఎక్కువ హీరోకు తక్కువ అన్నట్లుగా ఉందని దీంతో సునీల్ మళ్లీ బిజీ అవ్వడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube