పవన్ కళ్యాణ్ సినిమాలో కామెడీ పండించనున్న సునీల్

కమెడియన్, హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్… ఇప్పుడు సునీల్ ని ఎ కేటగిరీలో చేర్చాలో అనేది పూర్తిగా క్లారిటీ లేకపోయినా హీరోగా ఫెయిల్ అయ్యి టర్న్ తీసుకున్న తరువాత నటుడుగా సునీల్ కెరియర్ అద్భుతంగా ఉన్న ఒకప్పటి తన చరిష్మా మాత్రం చూపించాలేకపోతున్నాడు.అతని కామెడీ టైమింగ్ ని బయటకి తీసుకొచ్చే సినిమా ఇప్పటి వరకు పడలేదు.

 Sunil Got A Chance In Pawan Kalyan And Krish Combo Movie-TeluguStop.com

తివిక్రమ్ శ్రీనివాస్ తాను తీసే ప్రతి సినిమాలో అవకాశం ఇస్తున్న ఏదో నామమాత్రంగానే పాత్రలు ఉంటున్నాయి.అయితే డిస్కో రాజా సినిమాలో క్లిమాక్స్ లో ట్విస్ట్ ఇచ్చి విలన్ గా కనిపించాడు.

ఇప్పుడు కలర్ ఫోటో అనే సినిమా ద్వారా పూర్తి స్థాయిలో విలన్ గా కనిపించబోతున్నాడు.మొత్తానికి ఇప్పుడు సునీల్ కెరియర్ చూస్తూ అంటే అన్ని రకాల పాత్రలు చేయడానికి రెడీగా ఉన్నట్లు కనిపిస్తున్నాడు.

ఇదిలా ఉంటే ఇప్పుడు సునీల్ కి క్రిష్-పవన్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే పీరియాడికల్ మూవీలో అవకాశం వచ్చినట్లు తెలుస్తుంది.క్రిష్ సినిమాలో కామెడీ లైట్ క్లాస్ టచ్ తో బాగానే వుంటుంది.

టైమింగ్ కామెడీ కోసం వెయిట్ చేసి తిరిగి తనలో ఒకప్పటి నటుడుడి బయటకి తీసుకురావడం కోసం ఎదురుచూస్తున్న సునీల్ కి క్రిష్ మంచి పాత్ర ఇచ్చినట్లు తెలుస్తుంది.అయితే ఇలాంటి పాత్రలు పవన్ కళ్యాణ్ సినిమాలలో ఒకప్పుడు అలీ చేసేవాడు.

అయితే పవన్ కళ్యాణ్ ఈ సినిమా విషయంలో మాత్రం అలీని రికమండ్ చేయలేదని తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube