కమెడియన్ గా ఎన్నో సినిమా ల్లో నటించి మెప్పించిన సునీల్ హీరోగా ఆఫర్ రావడంతో అటుగా వెళ్లాడు.అక్కడ మంచి ఆఫర్లే వస్తున్నట్లుగా అనిపించడంతో కమెడియన్ గా సినిమా లు చేయడం మానేశాడు.
మెల్లగా సినిమాలకు సంబంధించిన విషయాల్లో సునీల్ జాగ్రత్తలు తీసుకుంటూ హీరోగా కొంత కాలం కష్టపడ్డాడు.కాని గత కొన్నాళ్లుగా ఈయన హీరోగా సక్సెస్ కాలేక పోతున్నాడు.
దాంతో చేసేది లేక మళ్లీ కమెడియన్ గా టర్న్ అయ్యాడు.కమెడియన్ కమ్ హీరోగా ప్రస్తుతం కెరీర్ కొనసాగుతోంది.
హీరోగా మరియు కమెడియన్ గా చేయడం అంటే మామూలు విషయం కాదు.కమెడియన్ గా బిజీ అయ్యేందుకు ఈయన చేస్తున్న ప్రయత్నాలు ఏమాత్రం సఫలం అయ్యేలా కనిపించడం లేదు.
ఈ సమయంలో ఈయనకు రామ్ చరణ్ మూవీలో ఆఫర్ వచ్చింది.
శంకర్ దర్శకత్వంలో చరణ్ హీరోగా దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా లో సునీల్ కు ముఖ్య పాత్ర దక్కింది అనేది తాజా సమాచారం.సినిమా షూటింగ్ ప్రారంభం సందర్బంగా మేకర్స్ సినిమా పోస్టర్ ను విడుదల చేశారు.అందులో ప్రాముఖ్య ఆధారంగానే పోస్టర్ లో చూపించడం జరిగింది.
అందులో క్లీయర్ గా సునీల్ కు ఒక మంచి ప్రాముఖ్యత ఉన్న పాత్ర దక్కింది అంటూ చెప్పకనే చెప్పాడు.శంకర్ సినిమాలో చిన్న పాత్ర అయినా పెద్ద పాత్ర అయినా కూడా అద్బుతం అన్నట్లుగానే ఉంటుంది.
ఇదే సినిమాలో అంజలి కూడా ఉంది.ఆమె పాత్ర కంటే సునీల్ పాత్ర నిడివి ఎక్కువ మరియు అంతకు మించి ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుంది అన్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
శంకర్ సినిమా లో నటించి సక్సెస్ అయితే పది కంటే ఎక్కువ సినిమాల్లో ఆఫర్లు వస్తాయి.దాంతో ఖచ్చితంగా మళ్లీ స్టార్ కమెడియన్ గా సునీల్ కు పేరు రావడం ఖాయం అంటూ అభిమానులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.