ఐపీఎల్ 2020 విన్నర్ ఎవరో తేల్చేసిన సునీల్ గవాస్కర్...!

సెప్టెంబర్ 19 నుండి మొదలు కాబోతున్న ఐపీఎల్ 2020 సీజన్ కు సంబంధించి ఇప్పటికే అన్ని ఐపీఎల్ టీం సభ్యులు చేరుకొని క్వారంటైన్ సమయాన్ని కూడా పూర్తి చేసుకొని ఆటగాళ్ళందరూ ప్రాక్టీస్ ను ముమ్మరంగా చేస్తున్నారు.ఇకపోతే ఈసారి కప్ ఎవరు గెలుస్తారు అన్న విషయంపై మాత్రం ఎవరికి వారు ధీమాగా ఉన్నారు.

 Impossible To Predict The Winner Of Ipl 2020 Sasys Sunil Gavaskar,ipl 2020, Chen-TeluguStop.com

తాజాగా ఈ విషయంపై ఈ సారి జరగబోయే ఐపిఎల్ లో ఏ జట్టు గెలుస్తుందో టీం ఇండియా మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ తెలియజేశాడు.

ఇక ఈ విషయం సంబంధించి ఇప్పటికే నాలుగు సార్లు టోర్నీని కైవసం చేసుకున్న ముంబై ఇండియన్స్ జట్టుకే ఈసారి కూడా గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు ఆయన తెలియజేశారు.

ముంబై ఇండియన్స్ జట్టు ఇప్పటికే నాలుగు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలుచుకుందని, ముంబై ఇండియన్స్ జట్టు ఫైనల్ మ్యాచ్ లో ఎలా గెలవాలో తెలుసుకుందని… అందువల్లే ముంబై ఇండియన్స్ జట్టు ఈసారి మళ్లీ ఐపీఎల్ టైటిల్ ను సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు గవాస్కర్ తెలియజేశారు.ఇక చెన్నై సూపర్ కింగ్స్ విషయానికి వస్తే… చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నాకౌట్ మ్యాచ్ లకు వస్తున్న ఆ మ్యాచ్ లలో ముంబయి ఇండియన్స్ జట్టును ఓడించలేక పోతుందని తెలియజేశారు.

ప్రస్తుతం ఉన్న టీమ్స్ లో ముంబై ఇండియన్స్ జట్టు చాలా బలంగా కనపడుతుందని… కాబట్టి ,కప్ గెలవడం లో ఎటువంటి అతిశయోక్తి లేదని ఆయన తెలియజేశారు.ముంబై ఇండియన్స్ జట్టు కచ్చితంగా ఫైనల్ కు వెళ్లడం ఖాయమని, ఫైనల్ కు చేరితే ముంబై ని ఎవరు ఓడించలేరని ధీమాగా చెబుతున్నారు.

ఇక మనందరికీ తెలిసిన విషయం ఏమిటంటే.ఇప్పటి వరకు మొత్తం 12 సార్లు ఐపీఎల్ సీజన్స్ లో ముంబై అత్యధికంగా 4 సార్లు టైటిల్ ను ఎగురేసుకెళ్లింది.

ఇక ఆ తర్వాతి స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ 3 సార్లు ఐపీఎల్ ట్రోఫీని గెలిచినా చాంపియన్ గా నిలిచింది.తదుపరి హైదరాబాద్ 2 సార్లు, అలాగే కోల్కతా నైట్ రైడర్స్ కూడా రెండుసార్లు విజేతలుగా నిలిచారు.

అలాగే మొట్టమొదటి సారి రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ ట్రోఫీని గెలిచింది.చూడాలి మరి ఈ సారి సునీల్ గవాస్కర్ చెబుతున్నట్లు ముంబై ఇండియన్స్ గెలుస్తుందో లేకపోతే మరేదో టీం గెలుస్తుందో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube