ట్రంప్ ని కలిసిన మాజీ భారత క్రికెటర్..ఎందుకంటే..!!!  

Sunil Gavaskar Meet Donal Trump-star Batsman,sunil Gavaskar

అమెరికాలో భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ పర్యటన చేస్తున్నారు.క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన తరువాత అదే క్రికెట్ మ్యాచ్ లకి వ్యాఖ్యాతగా కెరీర్ ప్రారంభించిన సునీల్ గవాస్కర్.సోషల్ సర్వీస్ కూడా చేయడం ప్రారంభించారు...

Sunil Gavaskar Meet Donal Trump-star Batsman,sunil Gavaskar-Sunil Gavaskar Meet Donal Trump-Star Batsman

హార్ట్ టూ హార్ట్ ఫౌండేషన్ తరుపున డొనేషన్స్ సేకరిస్తూ ఖాళీ సమయాలలో ఆ సంస్థకి ఎన్నో సేవలు చేస్తూ ఉంటారు సునీల్ గవాస్కర్.ఈ క్రమంలోనే

కొన్ని రోజుల క్రితం అమెరికా వెళ్ళిన సునీల్ గవాస్కర్ అక్కడ స్థిరపడిన భారతీయులతో సమావేశాలు ఏర్పాటు చేసి చిన్న పిల్లలకి గుండె సంభందిత చికిత్సలు ఉచితంగా చేసే హార్ట్ టూ హార్ట్ ఫౌండేషన్ కి విరాళాలు సేకరించారు.

Sunil Gavaskar Meet Donal Trump-star Batsman,sunil Gavaskar-Sunil Gavaskar Meet Donal Trump-Star Batsman

ఎంతో గొప్ప మనసు కల భారతీయులు అందరూ కలిసి సుమారు 85 లక్షల రూపాయలు డొనేషన్ గా సదరు సంస్థ తరుపున ప్రతినిధిగా వచ్చిన గవాస్కర్ కి అందించారు.

ఇదిలాఉంటే హార్ట్ టూ హార్ట్ ఫౌండేషన్ కి నిధులు సమకూర్చే క్రమంలోనే గవాస్కర్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో సమావేశం అయ్యారు.ఈ మేరకు సదరు సంస్థ చేపట్టే చారిటీ సేవలని, ఇప్పటి వరకూ ఎంతమంది అనాధ, పేద పిల్లలకి ఆపరేషన్లు నిర్వహించారో ట్రంప్ కి వివరించి చెప్పారు.నిధుల సేకరణలో గవాస్కర్ చూపిస్తున్న చొరవ, ఉచిత ఆపరేషన్లు చేస్తున్న హార్ట్ టూ హార్ట్ ఫౌండేషన్ ని ట్రంప్ అభినందించారు.