అలాంటి పాత్రతో డిజిటల్ ఎంట్రీ ఇస్తున్న సునీల్

డిజిటల్ స్క్రీన్ స్పేస్ లోకి సెలబ్రిటీలు అందరూ ఒకరి తర్వాత ఒకరుగా ఎంట్రీ ఇచ్చేస్తున్నారు.సిల్వర్ స్క్రీన్ పై కేవలం ఏదో ఒక జోనర్ పాత్రలకి పరిమితం కావాల్సి ఉంటుంది.

 Sunil Digital Entry With Web Series, Tollywood, Color Photo Movie, Telugu Cinema-TeluguStop.com

అయితే విభిన్న పాత్రలు చేయాలంటే డిజిటల్ లో కావాల్సినంత అవకాశం ఉంటుంది.భవిష్యత్తులో సినిమా అయినా వెబ్ సిరీస్ అయినా ప్రేక్షకులు ఎక్కువగా డిజిటల్ లోనే చూడటానికి ఇష్టపడతారు.

స్టార్ హీరోల సినిమాలు, అలాగే విజువల్ గ్రాండియర్ గా ఉండేవాటిని మాత్రమే సిల్వర్ స్క్రీన్ పై చూసేందుకు ఆసక్తి చూపిస్తారనేది ట్రెండ్ పండితుల మాట.ఈ నేపధ్యంలో ఇప్పటికే కెరియర్ ఎండ్ కి వచ్చిన సీనియర్ స్టార్ హీరోయిన్స్ తమ డిజిటల్ జర్నీ స్టార్ట్ చేసేశారు.అలాగే వెండితెరపై కమెడియన్స్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా మంచి అవకాశాలు ఉన్న స్టార్స్ కూడా డిజిటల్ లోకి అడుగుపెడుతున్నారు.

అక్కడ రెగ్యులర్ పాత్రలు కాకుండా కొత్తదనం ఉన్న కంటెంట్ లు ఎంచుకుంటూ తమ పంథా మార్చుకుంటున్నారు.

ఈ నేపధ్యంలో కమెడియన్ , హీరో గా రాణిస్తున్న సునీల్ కూడా డిజిటల్ వరల్డ్ లోకి అడుగుపెడుతున్నాడు.కలర్ ఫోటో టీమ్ రీసెంట్ ఓ ఫాంటసీ వెబ్ సిరీస్ ని తెరకెక్కించింది.

ఈ వెబ్ సిరీస్ లో సునీల్ ఏకంగా బ్రహ్మదేవుడు పాత్రలో కనిపించబోతున్నాడు.ఆ పాత్ర చుట్టూనే కథ తిరగబోతుందని తెలుస్తుంది.

ఈ నేపధ్యంలో ప్రాధాన్యత ఉన్న పాత్ర కావడంతోనే సునీల్ నటించినట్లు బోగట్టా.త్వరలో ఈ వెబ్ సిరీస్ ఆహలో రిలీజ్ అవుతుందని తెలుస్తుంది.

ఇదిలా ఉంటే విఎన్ ఆదిత్య దర్శకత్వంలో సునీల్ ఓ వెబ్ ఫిలిం కూడా చేస్తున్నాడు.ఇది త్వరలో రిలీజ్ కావడానికి రెడీ అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube