బీజేపీ వైపు నుంచి జగన్ కి ప్రమాద ఘటికలు! సునీల్ దియోధర్ హెచ్చరికలు  

Sunil Deodhar Warning To Ysrcp - Telugu Ap Politics, Bjp, Janasena,

ఏపీలో అధికార పార్టీ వైసీపీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి అనుకూలంగా ఉంది.వారి నుంచి నిధులు తెచ్చుకోవడానికి మోడీ, అమిత్ షా విధానాలకి జగన్ సమర్ధిస్తూ వస్తున్నారు.

 Sunil Deodhar Warning To Ysrcp

అయితే ఏపీలో మాత్రం కొంత ప్రజల దృష్టిలో మాత్రం బీజేపీతో కేవలం తాము రాష్ట్ర ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకొని కలుస్తున్నామనే విధంగా కలరింగ్ ఇస్తున్నారనే టాక్ రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.అయితే తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో వైసీపీ చాలా చోట్ల అరాచకాలకి పాల్పడింది.

వైసీపీ కార్యకర్తలు, బీజేపీ-జనసేన తరుపున నామినేషన్లు వేసే వారిపై దాడులు చేసి, భయపెట్టి పోటీకి రాకుండా చేసారు.ఈ విషయాన్ని బీజేపీ పార్టీ కూడా సీరియస్ గా తీసుకుందని ఆ పార్టీ ఏపీ ఇన్ చార్జ్ సునీల్ దియోధర్ మాటల బట్టి అర్ధమవుతుంది.

బీజేపీ వైపు నుంచి జగన్ కి ప్రమాద ఘటికలు సునీల్ దియోధర్ హెచ్చరికలు-Political-Telugu Tollywood Photo Image

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా తమ అభ్యర్థులు, కార్యకర్తలపై వైసీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డాయని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి సునీల్ దేవధర్ తీవ్ర ఆరోపణలు చేశారు.కార్యకర్తలపై జరుగుతున్న దాడులను బీజేపీ-జనసేన కూటమి అంత తేలిగ్గా తీసుకుంటుందని అనుకోవద్దని వైసీపీ నేతలకి నేరుగా హెచ్చరించారు.

కార్యకర్తల కోసం బీజేపీ ఎంతవరకైనా వెళ్తుందని స్పష్టం చేశారు.వైసీపీ గూండాలు బీజేపీ-జనసేన కార్యకర్తలపై దాడులకు ఉపక్రమించాయి.వారిని పోటీ చెయ్యనివ్వకుండా అడ్డుకున్నారు.ఇదే జగన్ నాడు టీడీపీ పాలన సందర్భంగా ప్రజాస్వామ్యం మంటగలుస్తోందంటూ గగ్గోలు పెట్టాడు” అంటూ సునీల్ దియోధర్ ట్వీట్ చేశారు.

అదే సమయంలో కరోనా తగ్గడానికి పారసిటమాల్ వేసుకుంటే చాలు అని జగన్ చేసిన కామెంట్స్ మీద కూడా సునీల్ కౌంటర్ వేసారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test