అనిల్ రావిపూడి సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన సునీల్.. అందుకే హిట్ అవుతాయట!

టాలీవుడ్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం లో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం ఎఫ్ 3. ఇందులో విక్టరీ వెంకటేష్ సరసన తమన్నా హీరోయిన్ గా నటించగా, వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ హీరోయిన్ గా నటించింది.

 Sunil Comments On F3 Movie And Anil Ravipudi Success Secret Details,  Sunil, F3-TeluguStop.com

ఈ సినిమాను దిల్ రాజు సమర్పణలో శిరీస్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే.ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ చిత్రం మే 27 న విడుదల కానున్న విషయం తెలిసిందే.

ఇకపోతే ఈ సినిమాలో మరొక హీరోయిన్ పాత్రలో ముద్దుగుమ్మ సోనాల్ చౌహాన్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.అలాగే ఈ సినిమాలో కమెడియన్ హీరో సునీల్ కూడా ఒక ముఖ్య పాత్రలో నటించారు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సునీల్ మాట్లాడుతూ ఈ సినిమా గురించి దర్శకుడు అనిల్ రావిపూడి గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ.

అనిల్‌ రావిపూడి గ్రేట్‌ ఆల్‌ రౌండర్‌.అనిల్ లో ఒక గొప్ప ఆర్టిస్ట్‌ కూడా ఉన్నాడు.

సినిమాలో ప్రతి ఒక్క సీన్‌ అతనే చేసి చూపిస్తాడు.అయితే నా టైమింగ్ నా కంటే అనిల్ కే బాగా తెలుసు.

ఇంతమంది స్టార్‌ కాస్ట్‌తో ఈ మధ్య కాలంలో ఎవరూ సినిమా తీయలేదు.తీసినా ఇంతమంది ఆర్టిస్ట్ లకి వేరే సినిమాలకి సర్దుబాటు చేస్తూ తీయలేదు.

ఎలాంటి పరిస్థితుల్లోనైనా నవ్వుతూ ఉంటాడు.ఆయనను చూసిన వెంటనే ఒక పాజిటివ్‌ ఎనర్జీ, స్మెల్‌ వస్తుంది.

అదే ఆయన సక్సెస్‌ సీక్రెట్‌.అని చెప్పుకొచ్చాడు సునీల్.

ఆయన ఎంత ఎనర్జిటిక్‌, పాజిటివ్‌గా ఉంటారో ఆయన సినిమాలు కూడా అలానే ఉంటాయి అని తెలిపాడు సునీల్‌.

Telugu Anil Ravipudi, Anilravipudi, Sunil, Mehreen Pirzada, Tamanna, Varun Tej,

ఎఫ్‌3లో మీ పాత్ర సినిమా అంతటా ఉంటుందా? అని ప్రశ్నించగా.హ సినిమా అంతా వుంటుంది.ఐతే ఫస్ట్ హాఫ్ లో ఎక్కువ సోలో పెర్ఫార్మెన్స్ కి అవకాశం వుంటుంది.

సెకండ్ హాఫ్ వచ్చేసరికి గ్రూప్ కామెడీగా వుంటుంది.అని తెలిపారు సునీల్.

అలాగే ఎఫ్3 సినిమాలో మీరు ఫేస్ చేసిన చాలెంజ్ ఏంటి ? అని అడగగా ఎఫ్ 3, పుష్ప ఒకే సమయంలో షూట్స్ లో పాల్గొన్నాను,రెండూ డిఫరెంట్ రోల్స్.అందులో ఒకటి కామెడీ మరొకటి విలన్ .పొద్దున్న కామెడీ చేసి రాత్రికి విలనీ చేయడం కాస్త చాలెజింగ్ అనిపించింది అని చెప్పుకొచ్చాడు సునీల్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube