డీటీఎస్ మూవీలో పవర్ ఫుల్ పాత్రలో సునీల్

కమెడియన్ గా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న నటుడు సునీల్.బ్రహ్మానందం తర్వాత ఆ స్థాయి గుర్తింపుని సునీల్ సొంతం చేసుకున్నాడు.

 Sunil Character Reveal From Dts Movie-TeluguStop.com

తరువాత హీరోగా టర్న్ తీసుకొని వరుసగా హ్యాట్రిక్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.అయితే హీరో అయిన తర్వాత కూడా ప్రేక్షకులు సునీల్ నుంచి ఎక్కువగా కామెడీ ఆశించారు.

అయితే సునీల్ ప్రేక్షకుల అంచనాలని అందుకోలేకపోవడంతో హీరోగా కొంత వరుస డిజాస్టర్స్ చూడాల్సి వచ్చింది.దీంతో హీరో నుంచి మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టర్న్ తీసుకొని సినిమాలు చేస్తూ మళ్ళీ బిజీ ఆర్టిస్ట్ అయిపోయాడు.

 Sunil Character Reveal From Dts Movie-డీటీఎస్ మూవీలో పవర్ ఫుల్ పాత్రలో సునీల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఒకప్పటి కామెడీ సునీల్ నుంచి రాకున్న కొత్తదనం ఉన్న పాత్రలు చేయడానికి ప్రయత్నం చేస్తూ నటుడుగా తన మార్క్ చూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు.అందులో భాగంగా కలర్ ఫోటో సినిమాలో నెగిటివ్ టచ్ ఉన్న పాత్రలో నటించి మెప్పించాడు.

ఈ సినిమాలో సునీల్ పెర్ఫార్మెన్స్ ని మంచి ప్రశంసలు లభించాయి.ఇదిలా ఉంటే ప్రస్తుతం సునీల్ చేతిలో హీరోగా మూడు సినిమాలు ఉన్నాయి.

అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ఫుల్ బిజీగా ఉన్నాడు.

సునీల్ ప్రస్తుతం తెలుగు, కన్నడ బైలింగ్వల్ మూవీ డీటీఎస్ లో నటిస్తున్నాడు.

ఈ సినిమాలో సునీల్ పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్నాడు.ఇక తాజాగా ఈ సినిమాలో సునీల్ క్యారెక్టర్ కి సంబంధించి లుక్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

అందులో యాక్షన్ మూడ్ లో సునీల్ కనిపిస్తూ ఉన్నాడు.ఈ సినిమాతో అభిరామ్ పిల్ల దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు.

కన్నడ హీరో చేతన్ సినిమాలో మరో కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.

#Abhiram Pilla #SunilCharacter #Sandalwood #Sunil #SunilNegative

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు