సునీల్‌ నిరూపించుకున్నాడు... ఫలితం దక్కేనా?  

Sunil Back With Chitralahari-comedian,hero,sunil

హీరోగా ఒకటి రెండు సక్సెస్‌లు రాగానే ఇక తనకు హీరోగా తిరుగు లేదని భావించిన సునీల్‌ వరుసగా అరడజనుకు పైగా సినిమాలు ఫ్లాప్‌ అవ్వడంతో ఏం చేయాలో పాలుపోక మళ్లీ కమెడియన్‌ వేశాలు వేస్తున్నాడు. కమెడియన్‌గా గతంలో ఎలా అయితే కనిపించే వాడో అలాగే కనిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. హీరోగా ఉన్నప్పుడు ఫిజిక్‌ మెయింటెన్‌ చేసి సిక్స్‌ ప్యాక్‌ కూడా ట్రై చేసిన సునీల్‌ హీరోగా అవకాశాలు తగ్గడంతో వెంటనే వర్కౌట్స్‌ మానేశాడు..

సునీల్‌ నిరూపించుకున్నాడు... ఫలితం దక్కేనా?-Sunil Back With Chitralahari

ఆ సమయంలోనే సునీల్‌ బాగా లావు అయ్యాడు. సునీల్‌ సంవత్సర కాలంగా కమెడియన్‌గా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే అరడజనుకు పైగా సినిమాలు చేశాడు.

కాని ఏ ఒక్కటి కూడా సునీల్‌లోని పూర్తి స్థాయి కమెడియన్‌ను చూపించలేక పోయింది. ఎట్టకేలకు వచ్చిన ‘చిత్రలహరి’ చిత్రం సునీల్‌లోని కమెడియన్‌ను చూపించింది. సునీల్‌ కామెడీలో ఇంకా పవర్‌ ఉందని, ఆయన నవ్వించగల సత్తా ఉన్న కమెడియన్‌ అంటూ అంతా అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వరుసగా కమెడియన్‌గా సినిమాలు చేయడం ఖాయం అంటున్నారు.

కమెడియన్‌గా మంచి పాత్రలు దక్కితే నవ్వించగల సత్తా ఉన్న సునీల్‌ ముందు ముందు మరిన్ని మంచి పాత్రలు చేస్తాడా లేదంటే కొన్ని సినిమాలతో కనుమరుగు అవుతాడా అనేది చూడాలి. సునీల్‌ కెరీర్‌లో చాలా ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడు. కెరీర్‌ ఆరంభంలో కమెడియన్‌గా ఆఫర్ల కోసం ప్రయత్నాలు చేసి విసిగి పోయాడు, హీరోగా సక్సెస్‌ లేక ఢీలా పడిపోయాడు, ఇప్పుడు కమెడియన్‌గా కష్ట పడుతున్నాడు. చిత్రలహరి చిత్రంతో తనలో ఇంకా కమెడియన్‌ ఉన్నాడని నిరూపించుకున్నాడు.

మరి సినిమా ఆఫర్లు అయితే వస్తాయా అనేది చూడాలి.