అందాల రాముడులో సునీల్ కంటే ముందుగా అనుకున్న హీరో ఎవరంటే?

మన తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్నంత మంది కమెడియన్స్ ఏ పరిశ్రమలో లేరన్న విషయం తెలిసిందే.ఒక డజను మంది స్టార్ కమెడియన్స్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి ప్రేక్షకులను అలరించారు.

 Sunil Andala Ramudu Movie Brahmaji-TeluguStop.com

అయితే స్టార్ కమెడియన్ లు కొంత మంది హీరోలుగా నటించి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.ఈ జాబితాలో అలీ, కృష్ణ భగవాన్, సునీల్ వంటి కమెడియన్ లు హీరోలుగా కొన్ని సినిమాలలో నటించారు.

అలీ హీరోగా నటించిన యమలీల సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలిసిందే.ఆ సినిమా అలీ కెరీర్ ఇంకా మరింత ముందుకు కొనసాగడానికి దోహదపడిందని అలీ చాలా ఇంటర్వ్యూలలో తెలిపారు.

 Sunil Andala Ramudu Movie Brahmaji-అందాల రాముడులో సునీల్ కంటే ముందుగా అనుకున్న హీరో ఎవరంటే-Gossips-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఇక మరో కమెడియన్ సునీల్ హీరోగా నటించిన సినిమా అందాల రాముడు.ఇది కమెడియన్ సునీల్ నటించిన మొదటి సినిమా.

ఈ సినిమాలో ఆర్తి అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో సునీల్ మంచి ఎమోషన్స్ పందడించడంతో ఈ సినిమాకు అడియన్స్ చాలా బాగా కనెక్ట్ అయ్యారు.అప్పట్లోనే 18 కోట్లు వసూలు చేసిందంటే ఈ సినిమా ఏ రేంజ్ లో కలెక్ట్ చేసిందో మనం అర్థం చేసుకోవచ్చు.

అయితే ఈ సినిమాలో హీరోగా సునీల్ కంటే ముందు మరొక కమెడియన్ ను తీసుకోవాలని భావించారట.ఆయనెవరో కాదు బ్రహ్మాజీ.

అయితే సిందూరం రీమేక్ లో నటిస్తూ బిజీగా ఉండడంతో ఈ సినిమాకు సునీల్ ని ఫైనల్ చేశారట ఇక ఈ సినిమా హిట్ అయిన తరువాత కొన్ని సినిమాలలో హీరోగా నటించినా మరల సునీల్ కమెడియన్ గా కొనసాగిన విషయం తెలిసిందే.

#Sunil #BrahmajiChosen #Andala Ramudu #Sunil #Brahmaji

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు